bounty to kill
-
పుతిన్ తలను తెగనరకండి.. రష్యా కుబేరుడి సంచలన ప్రకటన
Russian businessman Offered To Putin: రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రష్యాను వీడి అమెరికాలో ఆశ్రయం పొందుతున్న వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన చేశాడు. యుద్ధ నేరస్తుడిగా పుతిన్‌ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా సరే వన్ మిలియన్ డాలర్ల సొమ్మును బహుమతిగా ప్రకటిస్తానంటూ సైన్యానికి ఆఫర్ చేశాడు. ఫేస్బుక్ వేదికగా ఆయన ఈ బహిరంగ ప్రకటన చేయడం విశేషం. రష్యాకు చెందిన కొనానిఖిన్ అమెరికాలో పలు వ్యాపారాల్లో ఆరితేరాడు. పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. క్రిప్టో ఇన్వెస్టర్‌గా ఆయన చాలా ఫేమస్. అతని సంపద విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉంది. తాజాగా అతను రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి వ్యతిరేకంగా గళం విప్పాడు. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ చేతులు కట్టుకుని ఉండలేనంటున్నాడు ఫేస్బుక్లో కొనానిఖిన్ చేసిన పోస్టులో... పుతిన్ రష్యా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి స్వేచ్ఛాయుత ఎన్నికలు లేకుండా చేశాడు. తనని తాను జీవితకాల అధ్యక్షుడిని చేసుకున్నాడు. అకారణంగా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి వేల మంది చావుకి కారణమవుతున్నాడు. ఒక రష్యన్ పౌరుడిగా నా దేశాన్ని నాజియిజం నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉంది. అందుకే యుద్ధ నేరస్తుడిగా పుతిన్‌ని అరెస్ట్ చేసినా లేదా చంపిన సైనికులు, అధికారులకు వన్ మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు తమ దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ పౌరులకు సంఘీభావం ప్రకటించాడు కొనానిఖిన్. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొనానిఖిన్ 1992లో రష్యాను వీడాడు. ఆ తర్వాత 1999 నుంచి అమెరికాలో ఆశ్రయం పొందుతున్నాడు. అప్పటి నుంచి అక్కడే ప్రవాస జీవితం గడుపుతున్నారు. అమెరికాలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. పలుమార్లు ఇబ్బందులు ఎదురైనా అతను యూఎస్‌లోనే తలదాచుకుంటున్నాడు చదవండి: పుతిన్‌తో సంబంధాలు.. ఆస్తులు అమ్ముకుంటున్న రష్యన్ బిలియనీర్లు -
వికాస్ దూబే సహచరుడు అమర్ ఎన్కౌంటర్!
లక్నో : కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబేను పట్టిస్తే అందించే నగదు బహుమతిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు మరోసారి పెంచారు. ఇటీవల ఈ నగదు బహుమతిని 2.5 లక్షలుగా ప్రకటించిన పోలీసులు దీన్ని 5 లక్షలకు పెంచారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గల ఓ హోటల్లో వికాస్ దూబే ఉన్నాడని మంగళవారం పోలీసులకు సమాచారం అందగా, అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే విషయం తెలుసుకున్న వికాస్ దూబే సదరు హోటల్ నుంచి పరారయ్యాడు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే వికాస్ దూబేను పట్టిస్తే 5 లక్షల నగదు బహుమతి ఇస్తామని బుధవారం యూపీ పోలీసులు ప్రకటించారు. ఇదిలావుండగా కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దూబేను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులపై అతడి గ్యాంగ్ కాల్పులు జరిపిన ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగిన విషయం విదితమే.(ఆ హోటల్లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే..!) మరోవైపు వికాస్ దూబే అత్యంత సన్నిహితుడు అమర్ దూబేను బుధవారం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కాల్చి చంపారు. వికాస్ దూబే పర్సనల్ బాడీ గార్డు కూడా అయిన అమర్ దూబేను హామీర్ పూర్లో ఎన్ కౌంటర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. గతవారం చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో అమర్ దూబే హస్తం కూడా ఉంది. ఇతనిపై 25 వేల రూపాయల రివార్డు ఉంది. మరోవైపు చౌబేపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్‌ప్టర్‌కు చెందిన మరో సహచరుడైన శ్యామ్ బాజ్‌పాయ్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇక యూపీ, హర్యానా పోలీసులు సంయుక్తంగా వికాస్ దూబే కోసం మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్, గురుగ్రాం, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని పోలీసులు, ప్రజలను అప్రమత్తం చేశారు. (‘వాళ్లందరినీ చంపేయండి.. బతకొద్దు’) -
చంపేయండి! రూ.10 లక్షలు ఇస్తా
సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో ‘పాకిస్తాన జిందాబాద్’ అంటూ నినాదాలిచ్చారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న అమూల్య లియోన్‌పై శ్రీరామసేన సభ్యుడు షాకింగ్ కమెంట్స్ చేశారు. అమూల్యను హత్య చేసిన వారికి రూ .10 లక్షలు బహుమతిగా ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామసేన నాయకుడిగా చెప్పుకున్న సంజీవ్ మరాడి బల్లారిలో శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన 'దేశ వ్యతిరేక' చర్యలు క్యాన్సర్ లాగా వ్యాపిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కాశ్మీరీ విద్యార్థుల నాలుకలు తెగ్గోసిన వారికి రూ. 3 లక్షల రివార్డు ఇస్తానని మరో శ్రీ రామసేన నాయకుడు ప్రకటించిన అనంతరం సంజీవ్ మరాడి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే సంజీవ్ తమ పార్టీ సభ్యుడు కాదని బళ్లారి బీజేపీ నాయకుడు ప్రకటించారు. కాగా సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) వ్యతిరేకంగా 'సేవ్ ఇండియా' పేరుతో చేపట్టిన కార్యక్రమంలో అమూల్య అనే విద్యార్థి ఉద్యమ కార్యకర్త 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేయడం ఉద్రిక్తతను రాజేసింది. మరోవైపు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య లియోనాకు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్వయంగా ప్రకటించారు. దీంతో ఆమెపై 124ఏ దేశద్రోహం (సెడిషన్) కేసు నమోదు చేసిన పోలీసులు 14 రోజులు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. చదవండి : ‘పాక్ జిందాబాద్’ నినాదాలు.. 14 రోజుల కస్టడీ’ -
చంపేయండి: రూ.10 లక్షలు ఇస్తా
సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో ‘పాకిస్తాన జిందాబాద్’ అంటూ నినాదాలిచ్చారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న అమూల్య లియోన్‌పై శ్రీరామసేన సభ్యుడు షాకింగ్ కమెంట్స్ చేశారు. అమూల్యను హత్య చేసిన వారికి రూ .10 లక్షలు బహుమతిగా ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామసేన నాయకుడిగా చెప్పుకున్న సంజీవ్ మరాడి బల్లారిలో శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన 'దేశ వ్యతిరేక' చర్యలు క్యాన్సర్ లాగా వ్యాపిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కాశ్మీరీ విద్యార్థుల నాలుకలు తెగ్గోసిన వారికి రూ. 3 లక్షల రివార్డు ఇస్తానని మరో శ్రీ రామసేన నాయకుడు ప్రకటించిన అనంతరం సంజీవ్ మరాడి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే సంజీవ్ తమ పార్టీ సభ్యుడు కాదని బళ్లారి బీజేపీ నాయకుడు ప్రకటించారు. కాగా సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) వ్యతిరేకంగా 'సేవ్ ఇండియా' పేరుతో చేపట్టిన కార్యక్రమంలో అమూల్య అనే విద్యార్థి ఉద్యమ కార్యకర్త 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేయడం ఉద్రిక్తతను రాజేసింది. మరోవైపు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య లియోనాకు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్వయంగా ప్రకటించారు. దీంతో ఆమెపై 124ఏ దేశద్రోహం (సెడిషన్) కేసు నమోదు చేసిన పోలీసులు 14 రోజులు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. చదవండి : ‘పాక్ జిందాబాద్’ నినాదాలు.. 14 రోజుల కస్టడీ -
దర్శకుడిని చంపితే తక్షణమే రూ.51లక్షలు
సాక్షి, ముంబై: సంజయ్ లీలా భన్సాలీ వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’ పై తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలకు భారీ నజరానా ఇస్తామంటూ మరో గ్రూపు ప్రకటించింది. భన్సాలీ తల నరికిన వారికి రూ.51 లక్షల పారితోషికం ఇస్తామని ఆల్ ఇండియా బ్రజ్‌మండల్ క్షత్రియ రాజ్‌పుత్ మహాసభ ప్రకటించింది. భన్సాలీని హత్య చేస్తే తక్షణమే ప్రకటించిన బహుమతి అందిస్తామని బ్రజ్‌మండల్ క్షత్రియ రాజ్‌పుత్ మహాసభ ఉపాధ్యక్షుడు దివాకర్ సింగ్ వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ఆందోళనకు మద్దతు ఇవ్వకుండా ఈ సమస్యపై మౌనంగా ఉన్న రాజకీయవేత్తలకు తగిన గుణపాఠం చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్గావ్ స్కూలు పిల్లలపై దాడిగురించి ప్రశ్నించినపుడు ఆందోళనను పక్కదారి పట్టించేందుకు సినీ పరిశ్రమ అల్లిన కథ ఇది అని మండిపడ్డారు. రాజపుత్‌లు నిరాయుధులు, మహిళలు, పిల్లలపై ఎప్పటికీ దాడిచేయరని వివరణ ఇచ్చారు. కాగా అయితే చారిత్రాత్మక చిత్రం పద్మావత్ విషయంలో ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పద్మావతి పాత్రలో నటించిన దీపికా పదుకొనెను చంపేస్తామన్న బెదిరింపులొచ్చాయి. దీపికా ముక్కు చెవులు కోస్తే కోటి రూపాయలు ఇస్తామనీ, దీపికాను చంపితే రూ.5 కోట్లు ఇస్తామని కూడా కర్ణిసేన సంస్థ ప్రకటించింది. పద్మావత్ చిత్రం విడుదలను అడ్డుకుంటామని , థియేటర్స్‌లో సినిమా ఆడితే తగలబెట్టేస్తామంటూ కర్ణిసేన హెచ్చరించింది. రాజ్‌పుత్‌లను చెడ్డగా చిత్రీకరించిందని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించారంటూ మండిపడుతూ ఆందోళనకు దిగింది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి యు/ఏ సర్టిఫికేట్ పొందిన తరువాత, జనవరి 25న విడుదలైన గత రెండు రోజుల్లో ర్యాలీలు, విధ్వంసం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
కొత్త అధ్యక్షుడిని చంపితే.. 7 కోట్లిస్తాం!
ఫిలిప్పీన్స్ దేశానికి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్ట్‌ను హత్యచేస్తే దాదాపు రూ. 7.25 కోట్లు ఇస్తామంటూ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నేరస్తులు, డ్రగ్ డీలర్ల మీద యుద్ధం ప్రకటించడంతో డ్రగ్స్ మాఫియా ఈ రకంగా బెదిరిస్తోంది. ఫిలిప్పీన్స్‌కు కొత్తగా ఎన్నికైన పోలీస్ చీఫ్ రోనాల్డ్ డెలా రోసా ఈ విషయం వెల్లడించారు. కొత్త అధ్యక్షుడిని చంపితే 5 కోట్ల పెసోలు (దాదాపు రూ. 7.25 కోట్లు) ఇస్తామంటూ మాఫియా ప్రకటించిందని ఆయన తెలిపారు. మొదట్లో కోటిన్నర రూపాయలే ఆఫర్ చేసినా, తర్వాత ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ మొత్తాన్ని పెంచారట. తాను పాలనాపగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లో నేరాలు, డ్రగ్స్ మాఫియాను ఫిలిప్పీన్స్ నుంచి ఏరిపారేస్తానని కొత్త అధ్యక్షుడు డుటెర్ట్ ప్రకటించారు. డ్రగ్ డీలర్లను ఎవరైనా చంపేస్తే, వాళ్లకు తగినంతగా నగదు బహుమతులు కూడా ఇస్తామన్నారు. ఎవరైనా ప్రముఖ డ్రగ్ వ్యాపారిని హతమారిస్తే కనీసం అర కోటి వరకు బహుమతి ఇస్తామని చెప్పారు. ఈ మహమ్మారిని దేశం నుంచి తరిమేస్తే మనం బాగుంటామని, డ్రగ్స్ వ్యాపారులు దేశం వదిలిపోవాలని అన్నారు. దాంతో ఆయనను హతమార్చేందుకు డ్రగ్స్ వ్యాపారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.