
శ్రీరామ సేన నేత సంజీవ్ మరాడి
సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో ‘పాకిస్తాన జిందాబాద్’ అంటూ నినాదాలిచ్చారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న అమూల్య లియోన్‌పై శ్రీరామసేన సభ్యుడు షాకింగ్ కమెంట్స్ చేశారు. అమూల్యను హత్య చేసిన వారికి రూ .10 లక్షలు బహుమతిగా ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామసేన నాయకుడిగా చెప్పుకున్న సంజీవ్ మరాడి బల్లారిలో శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన 'దేశ వ్యతిరేక' చర్యలు క్యాన్సర్ లాగా వ్యాపిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కాశ్మీరీ విద్యార్థుల నాలుకలు తెగ్గోసిన వారికి రూ. 3 లక్షల రివార్డు ఇస్తానని మరో శ్రీ రామసేన నాయకుడు ప్రకటించిన అనంతరం సంజీవ్ మరాడి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే సంజీవ్ తమ పార్టీ సభ్యుడు కాదని బళ్లారి బీజేపీ నాయకుడు ప్రకటించారు.
కాగా సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ) వ్యతిరేకంగా 'సేవ్ ఇండియా' పేరుతో చేపట్టిన కార్యక్రమంలో అమూల్య అనే విద్యార్థి ఉద్యమ కార్యకర్త 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేయడం ఉద్రిక్తతను రాజేసింది. మరోవైపు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య లియోనాకు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్వయంగా ప్రకటించారు. దీంతో ఆమెపై 124ఏ దేశద్రోహం (సెడిషన్) కేసు నమోదు చేసిన పోలీసులు 14 రోజులు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment