sri rama sena
-
చంపేయండి! రూ.10 లక్షలు ఇస్తా
సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో ‘పాకిస్తాన జిందాబాద్’ అంటూ నినాదాలిచ్చారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న అమూల్య లియోన్‌పై శ్రీరామసేన సభ్యుడు షాకింగ్ కమెంట్స్ చేశారు. అమూల్యను హత్య చేసిన వారికి రూ .10 లక్షలు బహుమతిగా ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామసేన నాయకుడిగా చెప్పుకున్న సంజీవ్ మరాడి బల్లారిలో శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన 'దేశ వ్యతిరేక' చర్యలు క్యాన్సర్ లాగా వ్యాపిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కాశ్మీరీ విద్యార్థుల నాలుకలు తెగ్గోసిన వారికి రూ. 3 లక్షల రివార్డు ఇస్తానని మరో శ్రీ రామసేన నాయకుడు ప్రకటించిన అనంతరం సంజీవ్ మరాడి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే సంజీవ్ తమ పార్టీ సభ్యుడు కాదని బళ్లారి బీజేపీ నాయకుడు ప్రకటించారు. కాగా సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) వ్యతిరేకంగా 'సేవ్ ఇండియా' పేరుతో చేపట్టిన కార్యక్రమంలో అమూల్య అనే విద్యార్థి ఉద్యమ కార్యకర్త 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేయడం ఉద్రిక్తతను రాజేసింది. మరోవైపు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య లియోనాకు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్వయంగా ప్రకటించారు. దీంతో ఆమెపై 124ఏ దేశద్రోహం (సెడిషన్) కేసు నమోదు చేసిన పోలీసులు 14 రోజులు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. చదవండి : ‘పాక్ జిందాబాద్’ నినాదాలు.. 14 రోజుల కస్టడీ’ -
ఫోన్ లో బెదిరిస్తున్నారు: ముతాలిక్
హుబ్లీ: చంపుతామంటూ ఫోన్ లో తనకు బెదిరింపులు వస్తున్నాయని శ్రీరామ సేన నాయకుడు ప్రమోద్ ముతాలిక్ తెలిపారు. ఆమిర్ ఖాన్ వ్యాఖ్యల గురించి, ఇస్లాం గురించి మాట్లాడవద్దంటూ తనను ఫోన్ లో బెదిరించారని వెల్లడించారు. గతంలోనూ తనకు బెదింపులు వచ్చాయని చెప్పారు. అయితే ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. హిందూమత పరిరక్షణ కోసం పనిచేయకుండా తనను ఎవరూ ఆపలేరని అన్నారు. 2009లో మంగళూరులోని ఓ పబ్‌లో మహిళలపై శ్రీరామ్‌సేన దాడి చేయడంతో ముతాలిక్ వార్తల్లోకెక్కారు. అప్పటినుంచి సంచలన ప్రకటనలతో వివాదస్పదుడిగా మారారు. 'అత్యాచారానికి పాల్పడిన వారి చేతులు నరికేయండి. వారి కోర్టు ఖర్చులు మేమే భరిస్తాం' అంటూ గతంలో ఆయన పిలుపునిచ్చారు. గోవా ప్రభుత్వం గతేడాది శ్రీరామసేనపై నిషేధం విధించింది. కాగా, దేశంలో మత అసహనం పెరిగిపోతోందని వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ పై హిందుత్వ వాదులు మండిపడుతున్నారు. శివసేన నేతలయితే ఆమిర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. -
సబీర్ చేరికపై నక్వీ ఫైర్
బీజేపీ దావూద్‌నూ చేర్చుకుంటుందని ఎద్దేవా న్యూఢిల్లీ: శ్రీరామ్‌సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ను చేర్చుకుని గంటల్లోనే బయటకు పంపిన ఉదంతాన్ని మరవకముందే బీజేపీలో అలాంటి మరో వివాదం రాజుకుంది. జేడీయూ బహిష్కృత నేత సబీర్ అలీని కమలదళంలో చేర్చుకోవడంపై పార్టీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ ఆగ్రహోదగ్రులయ్యారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్‌కు అలీ స్నేహితుడని, ఇక పార్టీలో చేరబోయే తదుపరి వ్యక్తి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్ కావొచ్చని స్వపక్షాన్ని ఎగతాళి చేశారు. అలీని చేర్చుకోవడం తప్పని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని తప్పు దిద్దుకోవాలని డిమాండ్ చేశారు. అలీ శుక్రవారం అట్టహాసంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న గంటల్లోనే నక్వీ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘ఉగ్రవాది భత్కల్ మిత్రుడు బీజేపీలో చేరారు. త్వరలో దావూద్‌నూ చేర్చుకుంటారు’ అని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అలీ చేరిక తనకు బాధ కలిగించిందని, ఈ విషయాన్ని పార్టీకి చెప్పానని తర్వాత విలేకర్లతో అన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న బీజేపీ, ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తిని చేర్చుకోవడాన్ని ఎలా సమర్థిస్తుందని నిలదీశారు. ముంబైలోని అలీ ఇంట్లోనే భత్కల్ అరెస్టయ్యాడని, సంగీత వ్యాపారదిగ్గజం గుల్షన్ కుమార్ హత్య కేసులో అలీ పేరు ఉందని చెప్పారు. ‘పార్టీ ఒక హిందుత్వ నేతను (ముతాలిక్) గంటల్లోనే బయటకు పంపినప్పుడు ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తిని ఎలా సహించగలం?’ అని అన్నారు. అలీ చేరిక గురించి పార్టీ చీఫ్ రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలియదని చెప్పారు. కాగా, పార్టీ బీహార్ కమిటీ సిఫార్సుపైనే అలీని చేర్చుకున్నామని, అతని పూర్వాపరాలు విచారించి తదుపరి చర్య తీసుకుంటామని బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేదీ తెలిపారు. విమర్శల నేపథ్యంలో అలీని చేర్చుకోవాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అలీ చేరికను ఆరెస్సెస్ కూడా వ్యతిరేకించింది. రాజ్‌నాథ్‌కు నిరసన తెలిపింది. బీజేపీ కొత్తవారిని చేర్చుకోవడంపై పార్టీ సీనియర్ నేత బహిరంగంగా విమర్శకు దిగడం గత కొన్ని రోజుల్లో ఇది రెండోసారి. బీఎస్సార్ కాంగ్రెస్ నేత బి.శ్రీరాములును చేర్చుకోవడాన్ని సుష్మా స్వరాజ్ వ్యతిరేకించడం తెలిసిందే. -
కాస్కోండిక
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ బీజేపీపై తిరుగుబాటు చేశారు. గత ఆదివారం బీజేపీ సభ్యత్వాన్ని ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేసిన ఆ పార్టీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో ధార్వాడ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. బుధవారం నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. అదే నియోజక వర్గం నుంచి బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి పోటీ చేస్తున్నారు. బెల్గాం నుంచి కూడా తమ అభ్యర్థి రమాకాంత్ హొర్నూర్కర్ పోటీ చేస్తారని హుబ్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముతాలిక్ ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బెంగళూరు దక్షిణ అభ్యర్థి అనంత కుమార్ తనకు బీజేపీలో స్థానం లేకుండా చేశారని ఆరోపించారు. కనుక ఆయనపై కూడా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. అనంత కుమార్ పరమ అవినీతిపరుడని, రూ.వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. ‘ఆయన అవినీతి అనంతం’ అంటూ విరుచుకు పడ్డారు. హిందూ సృస్కతి పరిరక్షణకు నడుం బిగించిన తనను బీజేపీ దారుణంగా వంచించిందని ఆక్రోశించారు. తనపై అనేక కేసులు బనాయించినా, సంస్కృతిని రక్షించే విషయంలో వెనకడుగు వేయలేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమకు ముస్లింల ఓట్లు అవసరమే లేదని తెగేసి చెప్పారు. -
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి
-
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి
ఘజియాబాద్ కొశాంబిలోని ఆమ్ఆద్మీ పార్టీ కార్యాలయంపై శ్రీరామ్ సేన మద్దతుదారులు దాడికి తెగబడ్డారు. సేన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆప్ కార్యాలయానికి చేరుకుని, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్‌లకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ క్రమంలో ఆప్ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దాంతో కిటికి అద్దాలు పగిలాయి. ఆప్ కార్యాలయంపై దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు పరారయ్యారు. హిందూ రక్షక సంస్థకు చెందిన శ్రీరామ్ సేనకు చెందిన మద్దతుదారులు ఆ దాడికి పాల్పడ్డారని ఘజియాబాద్ ఎస్ఎస్పీ ధర్మేంద్ర సింగ్ వెల్లడించారు. శ్రీరామ్ సేన మద్దతుదారుడు విష్ణు గుప్తా సారథ్యంలో ఆ దాడి జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పోలీసు ఉన్నతాధికారులు ఆప్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆప్ కార్యాయలం వద్ద భారీ భద్రతను మోహరించారు. ప్రముఖ న్యాయవాది జమ్మూ కాశ్మీర్‌పై వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ దాడి చేశారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.