ఉల్కాపాతం.. కోటీశ్వరుడయ్యాడు | Man Becomes Millionaire Overnight Meteorite Fell From The Sky | Sakshi
Sakshi News home page

రూ. 13 కోట్ల విలువైన అరుదైన స్పేస్ ‌రాక్‌

Published Thu, Nov 19 2020 2:41 PM | Last Updated on Thu, Nov 19 2020 2:45 PM

Man Becomes Millionaire Overnight Meteorite Fell From The Sky - Sakshi

జకర్తా: అదృష్టం ఎ‍ప్పుడు.. ఎలా.. ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. మట్టిలో మాణిక్యాలు దొరికి కోటీశ్వరులు అయిన వారిని చూశాం. కానీ ఉల్కాపాతం వల్ల కోటీశ్వరుడు అయిన వారి గురించి వినడం కానీ చూడటం కానీ ఇంతవరకు జరగలేదు కదా. తాజాగా ఈ అరుదైన సంఘటన వాస్తవ రూపం దాల్చిఇంది. ఉల్కా రాత్రికి రాత్రే ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. ఆకాశం నుంచి ఇంటి పై కప్పు మీద 13 కోట్ల రూపాయల విలువ చేసే ఓ స్పేస్‌ రాక్‌ పడింది. దాంతో అతడి దశ తిరిగింది. వివరాలు.. జోసువా హుటగలుంగ్‌ అనే వ్యక్తి ఇండోనేషియా ఉత్తర సుమిత్రాలోని కోలాంగ్‌లో నివాసం ఉంటున్నాడు. శవపేటికలు తయారు చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో  కొద్ది రోజుల క్రితం ఇంట్లో శవపేటిక తయారు చేస్తుండగా ఇంటి పై కప్పు మీద ఏదో పడినట్లు శబ్దం వినిపించింది. ఎవరైనా తన ఇంటి మీద రాళ్లు వేస్తున్నారా ఏంటి అనే అనుమానంతో బయటకు వచ్చి చూశాడు. అతడికి అక్కడ నల్లటి ఓ రాయి కనిపించింది. చేతిలోకి తీసుకున్నప్పుడు అది ఇంకా వేడిగానే ఉంది. బాగా పరిశీలించి చూడగా అది స్పేస్‌ రాక్‌ అని అర్థం అయ్యింది అన్నాడు. (చనిపోయిన బాలిక బతికింది: గంట తర్వాత..)

జోసువా మాట్లాడుతూ.. ‘ఇంటి పై కప్పు మీద పడిన ఆ ఉల్క 15 సెంటీమీటర్లు భూమిలోకి చొచ్చుకుపోయింది. ఇక దీని బరువు సుమారు 2.1కిలోగ్రాములు ఉంది. ఇది తప్పకుండా ఆకాశం నుంచే పడి ఉంటుందని నా నమ్మకం. మా ఇరుగుపొరగువారు కూడా ఇది ఉల్కే అన్నారు. ఎందుకంటే ఆకాశం నుంచి నా ఇంటికి మీదకు రాయి విసిరే అవకాశం లేదు. ఈ ఉల్కాపాతంతో నన్ను అదృష్టం వరించింది. ఇక నా జీవితంలో అన్ని సంతోషాలే ఉంటాయి. ఈ ఉల్క విలువ సుమారుగా 13 కోట్ల రూపాయలు ఉంటుంది అంటున్నారు. అంటే నా 30 ఏళ్ల జీతానికి సమానం. ఈ డబ్బులో కొంత భాగాన్ని చర్చి నిర్మాణానికి వినియోగిస్తాను’ అన్నాడు. ఇక ఈ ఉల్క క్వాలిటీ, పరిమాణాన్ని బట్టి దాని ధర నిర్ణయించబడుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక స్వచ్ఛతని బట్టి దీని విలువ గ్రాముకు 0.50-50 అమెరికన్‌ డాలర్లుగా ఉంటుందని తెలిపారు. ఈ అరుదైన లోహాలకు గరిష్టంగా గ్రాముకు 1000 డాలర్లు కూడా చెల్లిస్తారని తెలిపారు. (చదవండి: అదృష్టం అంటే అతనిదే, రాత్రికి రాత్రే...)

ఇక జోసువాకు దొరికిన స్పేస్‌ రాక్‌ 4.5 బిలయన్‌ సంవత్సరాల క్రితం నాటిదని.. ఇది సీఎం1/2 కార్బోనేషియస్ కొండ్రైట్‌ వర్గానికి చెందిన అరుదైన స్పేస్‌ రాక్‌ అని తేలింది. ఇక దీని ధర గ్రాముకు 857 అమెరిన్‌ డాలర్లు పలుకుతుందని.. మొత్తం చూస్తే.. 1.85 అమెరికన్‌ డాలర్లు (మన కరెన్సీలో సుమారు 137437517.50 రూపాయల)విలువ చేస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement