ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం..! | Tech Millionaire Bryan Johnsons Mumbai Visiting Discuss Future Of Health | Sakshi
Sakshi News home page

భవిష్యత్తులో ఆరోగ్యం, దీర్ఘాయువు ఎలా ఉండనుంది?

Published Thu, Dec 5 2024 2:57 PM | Last Updated on Thu, Dec 5 2024 3:51 PM

Tech Millionaire Bryan Johnsons Mumbai Visiting Discuss Future Of Health

అమెరికన్‌ టెక్‌ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేందుకు కోట్లకొద్దీ డబ్బులు ఖర్చుపెట్టి వార్తల్లో నిలిచిన సంగత తెలిసంది. దీన్ని బ్లూప్రింట్‌ ప్రాజెక్ట్‌ పేరుతో యువకుడిలా కనిపించే ప్రయోగాలకు నాందిపలికారు. ఈక్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో షేర్‌ చేసుకునేవారు. తాను చేస్తున్న ప్రయోగం సక్సస్‌ అయితే నిత్య యవ్వనంగా ఉండలనే మనిషి కోరిక నేరవేరడం తోపాటు దీర్ఘాయవును పొందేలా ఆరోగ్యంగా ఉండటం ఎలా అనేదానికి మార్గం సుగమం అవుతుందనేది బ్రయాన్‌ కోరిక. 

ఆయన కారణంగానే అందరిలోనూ భవిష్యత్తు ఆరోగ్యం, దీర్ఘాయువు ఎలా ఉండనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆ నేపథ్యంలో ఆయన ఏ చిన్న ట్వీట్‌ చేసినా, ఎవ్వరితో సమావేశమైనా హాట్‌టాపిక్‌ అవుతుంది. తాజాగా బ్రయాన్‌ ముంబై సందర్శన తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. అక్కడ బ్రయాన్‌ లిటిల్ నెస్ట్ కమ్యూనిటీలో  శ్లోకా అంబానీ, ఆనంద్ పిరమల్, సోనమ్ కపూర్ అహుజా వంటి ప్రముఖులతో సమావేశమయ్యారు. 

ఆ సమావేశంలో వారితో భవిష్యత్తులో ఆరోగ్యం, దీర్ఘాయువు గురించి చర్చించారు. అలాగే జోమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ వంటి ప్రభావవంతమైన వ్యక్తులతో కూడా సమావేశమయ్యారు. ఇక బ్రయాన్‌ భారతదేశం పర్యటనలో వాయు కాలుష్యం గురించి మాట్లాడారు. దీన్ని అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా అభివర్ణించారు. ముంభైలో ఉన్న పేలవమైన గాలి నాణ్యత గురించి షేర్‌ చేసుకున్నారు. ఈ కాలుష్యం ప్రభావం పడకుండా N95 మాస్క్‌లు, HEPA ఫిల్టర్‌లను ఉపయోగించాలని సూచించారు. 

ఇక్కడ గాలి నాణ్యత దారుణంగా ఉందని తన కళ్లు, గొంతు కూడా మండుతున్నాయని వాపోయారు. మంచి ఆరోగ్యం కోసం అందరూ ఆరోగ్యకరమైన గాలి లభించే వాతావరణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, బ్రయాన్‌ భారత్‌ పర్యటన సమావేశాలు దీర్ఘాయువుపై ప్రపంచ ఆసక్తిని గురించి నొక్కి చెబుతున్నాయి. అలాగే భారత్‌లోని హెల్త్‌ సంబంధితన వెల్నెస్‌ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకు వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యలను కూడా హైలెట్‌ చేసింది. 

 

(చదవండి: ఈ సూప్‌ తయారీకి మూలం బ్రిటిష్‌ అధికారులట..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement