posture
-
బాడీ పోశ్చర్(భంగిమ) కరెక్ట్‌గా ఉందా? హెచ్చరిస్తున్న టెక్ మిలియనీర్
టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్(46) తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలకు సంబంధించి.. మరో ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అత్యంత కీలకమైన మన బాడీ పోశ్చర్ గురించి చెప్పారు. ఇది శరీర భాగాల తోపాటు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిపారు. దాన్ని మెరుగుపరుచుకోకపోతే బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుందంటూ చాలా షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అందుకోసం ఏం చేయాలో కూడా వివరించారు. అవేంటంటే..తన యాంటీ ఏజింగ్ ప్రక్రియల్లో భాగంగా ప్రతి భాగాన్ని అత్యంత కేర్‌ఫుల్‌గా చూసుకుంటున్నారు బ్రయాన్. నిజానికి మన ఏజ్ పెరిగే కొద్ది ఎలాంటి మార్పులు సంభవించి నెమ్మదిగా వృద్ధాప్యం వస్తుందో కూడా వివరంగా చెప్పారు బ్రయాన్. తాను అనుకున్నట్లుగా వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టగలరో లేదో కచ్చితంగా చెప్పలేకపోయినా..ఏ అలవాట్ల వల్ల వేగంగా వృద్ధాప్య లక్షణాలు వస్తాయో ఆయన ప్రయోగాల ద్వారా చాలా క్లియర్‌గా తెలుస్తోంది. ఇక బ్రయాన్ యాంటీ ఏజింగ్ ప్రక్రియలో తెలిసిన మరో ఆసక్తికర విషయం బాడీ పోశ్చర్. ఇది సరిగా లేకపోతే మన ఆరోగ్యంపై ఎలాంటి భయంకరమైన ప్రతికూల ప్రభావం చూపుతుంతో వివరిస్తూ..తన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. తన బాడీ పోశ్చర్ చాలా భయంకరంగా ఉండేదని, అది నెమ్మదిగా తన బ్రెయిన్‌పై ఎలా ప్రభావం చూపిస్తుందో గమనించలేకపోయానని పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన ఎంఆర్ఐలో తన భంగిమ మెదడులోని రక్తాన్ని బంధించి గుండెకు ప్రసరించకుండా ఎలా అడ్డుకుంటుందో తెలిపారు. దీని కారణంగా తనకు మూర్చ, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసిందన్నారు. నిజానికి బాడీ పోశ్చర్ గురించి చాలమందికి సరిగా తెలియదు. ఇదే ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తుందన్నారు. ఒక రోజులో మన బాడీని చాలా తప్పుడు భంగిమల్లో ఉంచుతామని అన్నారు. అది కూర్చీలో కూర్చొవడం దగ్గర నుంచి స్క్రీన్‌వైపు చూసే విధానం వరకు సరైన పోశ్చర్‌లో కూర్చొమని అన్నారు.ఈ అలవాట్లే క్రమేణ కండరాల నొప్పి, రక్తప్రసరణ సమస్యలు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తు పనితీరు బలహీనపడటం, నరాల కుదింపు, వెన్నుముక అమరికలో తేడాలు, మూడ్ మార్పులు, నిద్రాభంగం తదితర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. తాను ఐదు ముఖ్యమైన విషయాల్లో తన బాడీ భంగిమను మెరుగుపరిచానని అన్నారు. నిటారుగా ఉండేలా వ్యాయామాలు, ఫోన్‌ని చూడటానికి తలవంచకుండా కంటికి సమాన స్థాయిలో పెట్టుకుని చూడటం వంటి మార్పులు చేయాలని సూచించారు. అలాగే రోజులో ప్రతి 30 నిమిషాల కొకసారి కదలడం, చురుకుగా ఉండటం, మెట్లు ఎక్కడం, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, డ్యాన్స్ వంటివి చేయాలని అన్నారు. రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా మన బాడీ పోశ్చర్ ఉండటం అత్యంత ముఖ్యం అని చెప్పారు బ్రయాన్. ఇది మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. జస్ట్ మన పోశ్చర్ మాత్రమే మెరుగుపరుచుకోవడమే కాదు మీ చుట్టు ఉండే వాతారవణాన్ని కూడా సరైన విధంగా మన భంగిమకు అనుగుణంగా మార్చుకోగలిగితే సత్ఫలితాలు పొందగలమని చెబుతున్నారు బ్రయాన్. కాగా, ఇంతకుమునుపు బ్రయాన్ తాను బట్టతల రాకుండా ఎలా నివారించింది, జుట్టు రాలు సమస్యను అరికట్టే చిట్కాలు వంటి వాటి గురించి షేర్ చేసుకున్నారు.I didn't realize how terrible my posture was until an MRI showed it was slowly killing my brain.A ticking time bomb of a problem that I've now dramatically improved with these five habits. 🧵 pic.twitter.com/qPGKiCsDXc— Bryan Johnson /dd (@bryan_johnson) October 10, 2024 (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి?
కారులో షికారంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి! కొంతమందికైతే ఇది వ్యసనంలాగా మారుతుంటుంది. కారులో పయనం సుఖవంతమైనదే కాకుండా బైక్‌తో పోలిస్తే సురక్షితమైనది కూడా! అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు అతిగా కారులో తిరగడానికే అలవాటు పడితే క్రమంగా కొన్ని శారీరక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అతిగా కారు డ్రైవ్ చేసేవారిలో నడుమునొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. వెన్నెముక చుట్టూ ఉండే కండరాలన్నీ బ్యాలెన్స్డ్గా ఉండడం, కండరాలకు ఎలాంటి నొప్పులు రాకుండా శరీరాన్ని తీరుగా ఉంచడమే గుడ్ పోశ్చర్. మన డైలీ లైఫ్‌లో ఎదురయ్యే శారీరక ఒత్తిడి కండరాలు, ఎముకలపై పడకుండా జాగ్రత్తపడడమన్నమాట! మనం సరైన భంగిమ లేదా పోశ్చర్ మెయిన్ టెయిన్ చేస్తున్నామో లేదో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. కూర్చున్నప్పుడు రెండు పాదాలు సమాంతరంగా నేలపై ఉన్నాయా? రెండు పిరుదులపై సమాన భారం పడుతోందా? వెన్నెముక నిటారుగా ఉందా? భుజాలను చెవులకు సమాంతరంగా రిలాక్స్‌గా ఉంచామా? నిలుచున్నప్పుడు మోకాలి జాయింట్లు లాక్ అవకుండా నిల్చుంటున్నామా? పడుకున్నప్పుడు శరీరం సమాంతరంగా ఉంటోందా? వంటివి చెక్ చేయడం ద్వారా పోశ్చర్ మెయిన్ టెయిన్ అవుతుందా, లేదా తెలిసిపోతుంది. సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయకపోతే, వెన్నుముక పెళుసుగా మారి, ఈజీగా దెబ్బతింటుంది. కండరాల నొప్పులు ఆరంభమై క్రమంగా పెరిగిపోతాయి. మెడ, భుజం, వెన్ను నొప్పులు పర్మినెంట్‌గా ఉండిపోతాయి. కీళ్ల కదలికలు దెబ్బతింటాయి. క్రమంగా ఈ మార్పులు జీర్ణవ్యవస్థను మందగింపజేస్తాయి. ఆపైన శ్వాస ఆడడం ఇబ్బందిగా మారుతుంది. ఈ ఇబ్బందులన్నీ మరీ ముదిరిపోతే తీవ్ర వ్యాధుల పాలు కావాల్సిఉంటుంది. అందువల్ల కారు డ్రైవింగ్ చేసే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి... మీ కాళ్ల పొడవుకు అనుగుణంగా సీట్‌ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. కాళ్లు పొడవుగా ఉన్నవారు సీట్‌ను మరీ ముందుకు ఉంచకుండా తగినంత దూరంలో ఫిక్స్ చేసుకోవాలి. అలాగే మీ ఎత్తుకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవడం అవసరం. మీ సీట్‌ను నిటారుగా ఉండేలా చూసుకోవడం మంచిది. అయితే అలా నిటారుగా ఉండటం మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా, కాస్తంత ఏటవాలుగా సీట్ ఒంచాలి. ఆ సీట్ ఒంపు ఎంత ఉండాలంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి. మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది. మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్రెస్ట్ ఉండాలి. సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి. అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మీకు అన్ని విధాలా రక్షణ కల్పించడమే కాదు... మరెన్నో విధాలుగా మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. ఒకవేళ పోశ్చర్ బాగా దెబ్బతిన్నదనిపిస్తే డాక్టర్ సలహాతో కాల్షియం, విటమిన్ డీ సప్లిమెంట్స్, తేలికపాటి పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు. బాడీ భంగిమను నిలబెట్టే ఉపకరణాలు(పోశ్చర్ బెల్ట్స్ లాంటివి) వాడవచ్చు. మరీ ఎక్కువగా ఇబ్బందులుంటే అలెగ్జాండర్ టెక్నిక్ టీచర్స్, ఫిజియోథెరపిస్ట్, ఖైరోప్రాక్టర్, ఓస్టియోపతీ ప్రాక్టీషనర్ సహాయం తీసుకోవాలి. అవసరమైతే వీరు సూచించే ఎలక్ట్రోథెరపీ, డ్రైనీడిలింగ్, మసాజింగ్, జాయిట్ మొబిలైజేషన్ లాంటి విధానాలు పాటించాలి. స్మార్ట్ పోశ్చర్, అప్రైట్ లాంటి మొబైల్ యాప్స్‌లో సరైన భంగిమల గురించి, గుడ్‌పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయడం గురించి వివరంగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కారులో షికారు హుషారునిస్తుంది. – డి. శాయి ప్రమోద్ -
మీ భంగిమలను ఇలా చెక్ చేసుకోండి!
జీవ పరిణామ క్రమంలో ఉన్నత పరిణామం చెందిన జీవి మనిషి. ఇతర ఏ జంతువులకు లేని విధంగా నిటారుగా నిల్చోడం, నిటారుగా పరిగెత్తడం, కూర్చోగలగడం మనిషికే ప్రత్యేకం. ఇందుకు మన శరీరం పొందిన పరిణామ క్రమం కారణం. అయితే మనం కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా సరైన బాడీపోశ్చర్ ( శరీర భంగిమ) మెయిన్‌టెయిన్ చేయకపోతే కొత్త కొత్త ఇబ్బందులు కొనితెచ్చుకోవడం జరుగుతుంది. సరైన శరీర భంగిమ అంటే గుడ్ పోశ్చర్ మెయిన్‌టెయిన్ చేయడం హెల్తీలైఫ్కు చాలా అవసరం. అసలు గుడ్‌పోశ్చర్ అంటే... వెన్నెముక చుట్టూ ఉండే కండరాలన్నీ బ్యాలెన్స్డ్గా ఉండడం, కండరాలకు ఎలాంటి నొప్పులు రాకుండా శరీరాన్ని తీరుగా ఉంచడమే గుడ్ పోశ్చర్. మన డైలీ లైఫ్‌లో ఎదురయ్యే శారీరక ఒత్తిడి కండరాలు, ఎముకలపై పడకుండా జాగ్రత్తపడడమన్నమాట! ఎలా చెక్ చేయాలి.. మనం సరైన భంగిమ లేదా పోశ్చర్ మెయిన్‌టెయిన్ చేస్తున్నామో లేదో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. కూర్చున్నప్పుడు రెండు పాదాలు సమాంతరంగా నేలపై ఉన్నాయా? రెండు పిరుదులపై సమాన భారం పడుతోందా? వెన్నెముక నిటారుగా ఉందా? భుజాలను చెవులకు సమాంతరంగా రిలాక్స్‌గా ఉంచామా? నిలుచున్నప్పుడు మోకాలి జాయింట్లు లాక్ అవకుండా నిల్చుంటున్నామా? పడుకున్నప్పుడు శరీరం సమాంతరంగా ఉంటోందా? వంటివి చెక్ చేయడం ద్వారా పోశ్చర్ మెయిన్‌టెయిన్ అవుతుందా, లేదా తెలిసిపోతుంది. హెల్త్‌పై ప్రభావం.. సరైన పోశ్చర్ మెయిన్‌టెయిన్ చేయకపోతే, వెన్నెముక పెళుసుగా మారి, ఈజీగా దెబ్బతింటుంది. కండరాల నొప్పులు ఆరంభమై క్రమంగా పెరిగిపోతాయి. మెడ, భుజం, వెన్ను నొప్పులు పర్మినెంట్‌గా ఉండిపోతాయి. కీళ్ల కదలికలు దెబ్బతింటాయి. క్రమంగా ఈ మార్పులు జీర్ణవ్యవస్థను మందగింపజేస్తాయి. ఆపైన శ్వాస ఆడడం ఇబ్బందిగా మారుతుంది. ఈ ఇబ్బందులన్నీ మరీ ముదిరిపోతే తీవ్ర వ్యాధుల పాలు కావాల్సిఉంటుంది. మెరుగుపరుచుకోవడం ఎలా.. ► మనం చేసే ప్రతి దైనందిన కార్యక్రమాల్లో సరైన భంగిమలో శరీరాన్ని ఉంచడం చాలా అవసరం అని గుర్తించండి. ► చురుగ్గా ఉండడం, తేలికపాటి వ్యాయామాలు, యోగాలాంటి అభ్యాసాలు, అధిక బరువు పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. ► దీంతో పాటు హైహీల్స్ అలవాటు మానుకోవడం, ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం, నిల్చోవడం చేయకుండా శరీరాన్ని అప్పుడప్పుడు కదిలించడం, కంప్యూటర్, టీవీ వంటివి చూసేటప్పుడు లేదా టేబుల్ మీల్స్ చేసేటప్పుడు మెడను సరైన ఎత్తులో ఉంచుకోవడం ద్వారామెడపై భారం లేకుండా చేయాలి. ► ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోవాల్సివస్తే మధ్యలో నడుస్తుండడం లేదా శరీరాన్ని మెల్లగా స్ట్రెచ్ చేయడం, కూర్చున్నప్పుడు పాదాలు మెలికవేసుకోకుండా భూమిపై సమాంతరంగా ఉంచడం, భుజాలను రిలాక్స్ మోడ్‌లో ఉంచడం, కూర్చున్నా లేదా పడుకున్నా నడుముకు తగిన సపోర్ట్ ఇచ్చే ఏర్పాటు చేసుకోవడం అవసరం. ► సెల్ మెసేజ్ చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు తల వంచకుండా (ఇలా ఎప్పుడూ తలొంచుకొని మొబైల్లో మునిగిపోతే మెడ పట్టేస్తుంది. దీన్ని టెక్ట్స్ నెక్ అంటారు) తలకు సమాంతరంగా ఫోన్‌ను పైకి లేపి చూడడం, నడిచేటప్పుడు నిటారుగా తలెత్తుకు నడవడం వంటి పద్ధతులతో సరైన పోశ్చర్ పాటించవచ్చు. ► బాడీ పోశ్చర్ బాగా దెబ్బతిన్నదనిపిస్తే డాక్టర్ సలహాతో కాల్షియం, విటమిన్ డీ సప్లిమెంట్స్, తేలికపాటి పెయిన్‌కిల్లర్స్ వాడవచ్చు. బాడీ భంగిమను నిలబెట్టే ఉపకరణాలు(పోశ్చర్ బెల్ట్స్ లాంటివి) వాడవచ్చు. ► మరీ ఎక్కువగా ఇబ్బందులుంటే అలెగ్జాండర్ టెక్నిక్ టీచర్స్, ఫిజియోథెరపిస్ట్, ఖైరోప్రాక్టర్, ఓస్టియోపతీ ప్రాక్టీషనర్ సహాయం తీసుకోవాలి. అవసరమైతే వీరు సూచించే ఎలక్ట్రోథెరపీ, డ్రైనీడిలింగ్, మసాజింగ్, జాయిట్ మొబిలైజేషన్ లాంటి విధానాలు పాటించాలి. ► స్మార్ట్ పోశ్చర్, అప్రైట్ లాంటి మొబైల్ యాప్స్‌లో సరైన భంగిమల గురించి, గుడ్‌పోశ్చర్ మెయిన్‌టెయిన్ చేయడం గురించి వివరంగా ఉంటుంది. -
ఆరోగ్యంగా ‘సాగు’దాం
యోగా విభిన్న రకాలుగా శరీరాన్ని వంచే వీలున్నప్పటికీ ఏళ్ల తరబడి\ఒకే భంగిమకు అలవాటు పడిపోవడం వల్ల∙మనిషికి అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే శరీరాన్నివీలున్నంతగా సాగదీయడమే ప్రాచుర్యం పొందిన యోగాసనాల ముఖ్యోధ్దేశంగా ఉంటుంది. అలాంటి ఆసనాల ద్వారా ఆరోగ్యంవైపు మనం చేసే ప్రయాణానికి కొన‘సాగి’ంపు ఇది... 1. పద్మాసనం కుర్చీలో సమంగా కూర్చోవాలి. రెండు కాళ్లు ముందున్న కుర్చీలోకి స్ట్రెచ్ చేసి కాళ్లు బాగా రిలాక్స్ చేసుకోవాలి. ఎడమకాలును స్ట్రయిట్‌గా ఉంచి కుడికాలును మడిచి, కుడి పాదాన్ని ఎడమ తొడ మీద నడుముకి దగ్గరగా ఉంచాలి. కుడి మోకాలుౖ పెకి కిందకి ఫ్రీ చేసుకుని, ఎడమపాదాన్ని కుడిచేత్తో పట్టుకుని (కాలు స్ట్రయిట్‌గా ఉంచలేకపోతే ఎడమకాలు మడవొచ్చు) అవసరమైతే వీపును కుర్చీలో ఏటవాలుగా ఆనించినట్లయితే నడుము భాగం కొంచెం వంగినప్పటికీ తొడకీలు భాగంలో ఎక్కువ ఫ్లెక్సిబులిటీ వస్తుంది. దీంతో కుడికాలు మీదకు ఎడమకాలును ఫోల్డ్ చేసి ఉంచడం తేలికవుతుంది. గాలిలోకి లేచిన పద్మాసనాన్ని ఇంకా కొంచెం టైట్ చేస్తూ, నెమ్మదిగా కిందకు దించవచ్చు. పద్మం అనగా కమలం లేదా తామరపువ్వు. ఈ ఆసనాన్ని బేస్‌గా చేసుకుని అనేక ఇతర అడ్వాన్స్డ్ యోగా భంగిమలు సాధన చేయవచ్చు. ఉదాహరణకు బద్ధకోణాసన, కుక్కుటాసన, పద్మమురాసన, పద్మ సాంపాసన, గర్భ పిండాసన, మత్సా్యసన, పద్మ శీర్షాసన... మొదలైనవి. అయితే పద్మాసనంలో సుదీర్ఘ ధ్యానం యోగులకు మాత్రమే సాధ్యం. ఉపయోగాలు: ప్రాణాయామ సాధనకి బాగా ఉపకరిస్తుంది. నడుము, వెన్నెముక, మెడ ఆటోమేటిక్‌గా నిటారుగా ఉండడం వల్ల ఉపిరితిత్తుల పనితీరు మెరుగకు, సయాటికా, మూత్రకోశ సమస్యలకు, రుతుక్రమ సమస్యలకు ఉపయుక్తం. జాగ్రత్తలు: పెల్విస్, పిక్క కండరాలు స్టిఫ్‌గా ఉన్నవారు ఎక్కువ సాధన చేసిన తర్వాత కాని పద్మాసనం వేయడం సాధ్యపడదు. మోకాలు, లేదా చీలమండలం గాయాలున్నవారు శిక్షకుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. 2. పశ్చిమోత్తాసన రెండు కాళ్లు ముందున్న కుర్చీలోకి స్ట్రెచ్ చేయాలి. కాళ్లను పక్కకు తిప్పుతూ మోకాలి కీళ్లు, తొడ కీళ్లు, చీలమండలాన్ని ఫ్రీ చేసుకోవాలి. శ్వాస వదులుతూ నడుము ముందుకు వంచుతూ తలను, నుదురును మోకాలుకు దగ్గరగా తెచ్చి పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆసనంలోకి వంగిన తర్వాత సాధారణ శ్వాస తీసుకోవచ్చు. మోకాళ్లు స్ట్రయిట్‌గా ఉంచలేని పక్షంలో పైకి లేపి ఉంచవచ్చు. ఒకవేళ పూర్తిగా ముందుకు వంగ లేనప్పుడు రెండు చేతులతో ముందున్న కుర్చీ హ్యాండిల్‌ని పట్టుకుని, దాని సపోర్ట్‌తో శ్వాస వదులుతూ వీలైనంత ముందుకు వంగవచ్చు. శ్వాస తీసుకుంటూ మళ్లీ పైకి శ్వాస వదులుతూ ముందుకు వంగడం... ఇలా కనీసం 15, 20 సార్లు సాధన చేసినట్లయితే క్రమక్రమంగా పూర్తి ఆసన స్థితికి చేరుకోవచ్చు. 3. విశ్రాంత పశ్చిమోత్తాసన కాళ్లు ముందుకు స్ట్రయిట్‌గా ఉంచి చేయడం సాధ్యం కానప్పుడు కింది ఫొటోలో చూపినట్టుగా కాళ్లు రెండూ కిందకు నేల మీద ఉంచి శ్వాస వదులుతూ ముందుకు వంగి చేతులు కూడా ముందుకు స్ట్రెచ్ చేసి పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉండవచ్చు. కావాల్సినంత సేపు సాధారణ శ్వాస తీసుకుంటూ ఉండి, శ్వాస పీల్చుకుంటూ పైకి లేచి, కుర్చీలో సమంగా కూర్చోవాలి. ఏ విధంగా చేసినప్పటికీ దీని వల్ల కలిగే లాభాల్లో మార్పుండదు. ఉపయోగాలు: శరీరపు వెనుక భాగం పశ్చిమంగా కూడా రిఫర్ చేయబడుతుంది. ఉత్థాన అనగా వ్యాకోచింపజేయడం లేదా సాగదీయడం. వీపు భాగాన్ని సాగదీసే ఆసనం కనుక దీన్ని పశ్చిమోత్తాసనం అంటారు. ఈ ఆసనం వల్ల కిడ్నీలు, అడ్రినలిన్ గ్రంథులు బాగా చైతన్యవంతం అవుతాయి.హార్మోనుల సమతుల్యతకు ఉపకరిస్తుంది. అధిక రక్తపోటు, నిద్రలేమి, మోనోపాజ్ సమస్యలకూ, మానసిక ఒత్తిడికీ ఇది పరిష్కారం. సమన్వయం– సత్యబాబు -
శిల్పారామానికి చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి, విజయవాడ : నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శిల్పారామం ఏర్పాటుకు అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. భవానీద్వీపంలోని 20 ఎకరాల స్థలాన్ని శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీకి కేటాయించాలంటూ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. 133 ఎకరాల విస్తీర్ణం ఉన్న ద్వీపంలో ఎక్కడ స్థలం కేటాయించాలనే అంశంపై ఏపీటీడీసీ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రాంతంలో ముళ్లకంపలు ఉండడంతో వాటిని తొలిగించిన తరువాత సర్వేయర్‌తో కొలతలు వేయించి పది రోజుల్లో శిల్పారామం సొసైటీకి అప్పగించనున్నారు. స్థలం వస్తే టెండర్ల పిలుపు.. ఇరవై ఎకరాల స్థలం రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు శిల్పారామం సొసైటీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. శిల్పారామం నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.ఐదు కోట్లు మంజూరుచేసింది. ఇవి ఖర్చుచేశాక మరికొన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఏడాది క్రితమే పనులు ప్రారంభించాల్సి ఉండగా.. స్థలం కొరత కారణంగా మొదలుకాలేదు. చందనాఖాన్ ఆదేశాలతో అధికారులు భవానీద్వీపాన్ని పరిశీలించి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. రూ. 2.5 కోట్లతో కల్యాణమండపం.. శిల్పారామంలో సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో 1200 మందికి ఉపయోగపడే విధంగా కల్యాణమండపం, డైనింగ్ హాల్ నిర్మించాలని భావిస్తున్నారు. పక్కనే ఏపీటీడీసీకి చెందిన కాటేజీలు ఉన్నాయి. భారీఎత్తున పెళ్లిళ్లు చేసుకునేవారు శిల్పారామం కల్యాణమండపంతోపాటు ఏపీటీడీసీ కాటేజీలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పిల్లల కోసం ఆటపరికరాలను ఏర్పాటుచేస్తారు. హస్తకళాకారులు తయారుచేసిన వస్తువుల్ని ప్రదర్శించుకునేందుకు వీలుగా దుకాణాలు నిర్మిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు వస్తే వారు అక్కడే ఉండే విధంగా సౌకర్యాలు కల్పిస్తారు. ఏడాదికి రెండుసార్లు జాతీయ స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించేందుకు తగిన విధంగా శిల్పారామాన్ని తీర్చిదిద్దుతారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకు చెందిన ప్రజలు రాజధానికి వచ్చిపోతుంటారు. వారిని ఆకట్టుకునేలా శిల్పారామాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది.