ఆరోగ్యంగా ‘సాగు’దాం
యోగా
విభిన్న రకాలుగా శరీరాన్ని వంచే వీలున్నప్పటికీ ఏళ్ల తరబడి\ఒకే భంగిమకు అలవాటు పడిపోవడం వల్ల∙మనిషికి అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే శరీరాన్నివీలున్నంతగా సాగదీయడమే ప్రాచుర్యం పొందిన యోగాసనాల ముఖ్యోధ్దేశంగా ఉంటుంది. అలాంటి ఆసనాల ద్వారా ఆరోగ్యంవైపు మనం చేసే ప్రయాణానికి కొన‘సాగి’ంపు ఇది...
1. పద్మాసనం
కుర్చీలో సమంగా కూర్చోవాలి. రెండు కాళ్లు ముందున్న కుర్చీలోకి స్ట్రెచ్ చేసి కాళ్లు బాగా రిలాక్స్ చేసుకోవాలి. ఎడమకాలును స్ట్రయిట్‌గా ఉంచి కుడికాలును మడిచి, కుడి పాదాన్ని ఎడమ తొడ మీద నడుముకి దగ్గరగా ఉంచాలి. కుడి మోకాలుౖ పెకి కిందకి ఫ్రీ చేసుకుని, ఎడమపాదాన్ని కుడిచేత్తో పట్టుకుని (కాలు స్ట్రయిట్‌గా ఉంచలేకపోతే ఎడమకాలు మడవొచ్చు) అవసరమైతే వీపును కుర్చీలో ఏటవాలుగా ఆనించినట్లయితే నడుము భాగం కొంచెం వంగినప్పటికీ తొడకీలు భాగంలో ఎక్కువ ఫ్లెక్సిబులిటీ వస్తుంది. దీంతో కుడికాలు మీదకు ఎడమకాలును ఫోల్డ్ చేసి ఉంచడం తేలికవుతుంది. గాలిలోకి లేచిన పద్మాసనాన్ని ఇంకా కొంచెం టైట్ చేస్తూ, నెమ్మదిగా కిందకు దించవచ్చు.
పద్మం అనగా కమలం లేదా తామరపువ్వు. ఈ ఆసనాన్ని బేస్‌గా చేసుకుని అనేక ఇతర అడ్వాన్స్‌డ్ యోగా భంగిమలు సాధన చేయవచ్చు. ఉదాహరణకు బద్ధకోణాసన, కుక్కుటాసన, పద్మమురాసన, పద్మ సాంపాసన, గర్భ పిండాసన, మత్సా్యసన, పద్మ శీర్షాసన... మొదలైనవి. అయితే పద్మాసనంలో సుదీర్ఘ ధ్యానం యోగులకు మాత్రమే సాధ్యం.
ఉపయోగాలు: ప్రాణాయామ సాధనకి బాగా ఉపకరిస్తుంది. నడుము, వెన్నెముక, మెడ ఆటోమేటిక్‌గా నిటారుగా ఉండడం వల్ల ఉపిరితిత్తుల పనితీరు మెరుగకు, సయాటికా, మూత్రకోశ సమస్యలకు, రుతుక్రమ సమస్యలకు ఉపయుక్తం.
జాగ్రత్తలు: పెల్విస్, పిక్క కండరాలు స్టిఫ్‌గా ఉన్నవారు ఎక్కువ సాధన చేసిన తర్వాత కాని పద్మాసనం వేయడం సాధ్యపడదు. మోకాలు, లేదా చీలమండలం గాయాలున్నవారు శిక్షకుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
2. పశ్చిమోత్తాసన
రెండు కాళ్లు ముందున్న కుర్చీలోకి స్ట్రెచ్ చేయాలి. కాళ్లను పక్కకు తిప్పుతూ మోకాలి కీళ్లు, తొడ కీళ్లు, చీలమండలాన్ని ఫ్రీ చేసుకోవాలి. శ్వాస వదులుతూ నడుము ముందుకు వంచుతూ తలను, నుదురును మోకాలుకు దగ్గరగా తెచ్చి పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆసనంలోకి వంగిన తర్వాత సాధారణ శ్వాస తీసుకోవచ్చు. మోకాళ్లు స్ట్రయిట్‌గా ఉంచలేని పక్షంలో పైకి లేపి ఉంచవచ్చు. ఒకవేళ పూర్తిగా ముందుకు వంగ లేనప్పుడు రెండు చేతులతో ముందున్న కుర్చీ హ్యాండిల్‌ని పట్టుకుని, దాని సపోర్ట్‌తో శ్వాస వదులుతూ వీలైనంత ముందుకు వంగవచ్చు. శ్వాస తీసుకుంటూ మళ్లీ పైకి శ్వాస వదులుతూ ముందుకు వంగడం... ఇలా కనీసం 15, 20 సార్లు సాధన చేసినట్లయితే క్రమక్రమంగా పూర్తి ఆసన స్థితికి చేరుకోవచ్చు.
3. విశ్రాంత పశ్చిమోత్తాసన
కాళ్లు ముందుకు స్ట్రయిట్‌గా ఉంచి చేయడం సాధ్యం కానప్పుడు కింది ఫొటోలో చూపినట్టుగా కాళ్లు రెండూ కిందకు నేల మీద ఉంచి శ్వాస వదులుతూ ముందుకు వంగి చేతులు కూడా ముందుకు స్ట్రెచ్ చేసి పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉండవచ్చు. కావాల్సినంత సేపు సాధారణ శ్వాస తీసుకుంటూ ఉండి, శ్వాస పీల్చుకుంటూ పైకి లేచి, కుర్చీలో సమంగా కూర్చోవాలి. ఏ విధంగా చేసినప్పటికీ దీని వల్ల కలిగే లాభాల్లో మార్పుండదు.
ఉపయోగాలు: శరీరపు వెనుక భాగం పశ్చిమంగా కూడా రిఫర్ చేయబడుతుంది. ఉత్థాన అనగా వ్యాకోచింపజేయడం లేదా సాగదీయడం. వీపు భాగాన్ని సాగదీసే ఆసనం కనుక దీన్ని పశ్చిమోత్తాసనం అంటారు. ఈ ఆసనం వల్ల కిడ్నీలు, అడ్రినలిన్ గ్రంథులు బాగా చైతన్యవంతం అవుతాయి.హార్మోనుల సమతుల్యతకు ఉపకరిస్తుంది. అధిక రక్తపోటు, నిద్రలేమి, మోనోపాజ్ సమస్యలకూ, మానసిక ఒత్తిడికీ ఇది పరిష్కారం.
సమన్వయం– సత్యబాబు