మీ భంగిమలను ఇలా చెక్‌ చేసుకోండి! | Techniques To Good Posture | Sakshi
Sakshi News home page

మీ భంగిమలను ఇలా చెక్‌ చేసుకోండి!

Published Tue, Jan 26 2021 1:54 PM | Last Updated on Tue, Jan 26 2021 3:58 PM

Techniques To Good Posture - Sakshi

జీవ పరిణామ క్రమంలో ఉన్నత పరిణామం చెందిన జీవి మనిషి. ఇతర ఏ జంతువులకు లేని విధంగా నిటారుగా నిల్చోడం, నిటారుగా పరిగెత్తడం, కూర్చోగలగడం మనిషికే ప్రత్యేకం. ఇందుకు మన శరీరం పొందిన పరిణామ క్రమం కారణం. అయితే మనం కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా సరైన బాడీపోశ్చర్‌ ( శరీర భంగిమ) మెయిన్‌టెయిన్‌ చేయకపోతే కొత్త కొత్త ఇబ్బందులు కొనితెచ్చుకోవడం జరుగుతుంది.  సరైన శరీర భంగిమ అంటే గుడ్‌ పోశ్చర్‌ మెయిన్‌టెయిన్‌ చేయడం హెల్తీలైఫ్‌కు చాలా అవసరం. 

అసలు గుడ్‌పోశ్చర్‌ అంటే...


వెన్నెముక చుట్టూ ఉండే కండరాలన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం, కండరాలకు ఎలాంటి నొప్పులు రాకుండా శరీరాన్ని తీరుగా ఉంచడమే గుడ్‌ పోశ్చర్‌. మన డైలీ లైఫ్‌లో ఎదురయ్యే శారీరక ఒత్తిడి కండరాలు, ఎముకలపై పడకుండా జాగ్రత్తపడడమన్నమాట!

ఎలా చెక్‌ చేయాలి..
మనం సరైన భంగిమ లేదా పోశ్చర్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నామో లేదో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. కూర్చున్నప్పుడు రెండు పాదాలు సమాంతరంగా నేలపై ఉన్నాయా? రెండు పిరుదులపై సమాన భారం పడుతోందా? వెన్నెముక నిటారుగా ఉందా? భుజాలను చెవులకు సమాంతరంగా రిలాక్స్‌గా ఉంచామా? నిలుచున్నప్పుడు మోకాలి జాయింట్లు లాక్‌ అవకుండా నిల్చుంటున్నామా? పడుకున్నప్పుడు శరీరం సమాంతరంగా ఉంటోందా? వంటివి చెక్‌ చేయడం ద్వారా పోశ్చర్‌ మెయిన్‌టెయిన్‌ అవుతుందా, లేదా తెలిసిపోతుంది.


హెల్త్‌పై ప్రభావం..
సరైన పోశ్చర్‌ మెయిన్‌టెయిన్‌ చేయకపోతే, వెన్నెముక పెళుసుగా మారి, ఈజీగా దెబ్బతింటుంది. కండరాల నొప్పులు ఆరంభమై క్రమంగా పెరిగిపోతాయి. మెడ, భుజం, వెన్ను నొప్పులు పర్మినెంట్‌గా ఉండిపోతాయి. కీళ్ల కదలికలు దెబ్బతింటాయి. క్రమంగా ఈ మార్పులు జీర్ణవ్యవస్థను మందగింపజేస్తాయి. ఆపైన శ్వాస ఆడడం ఇబ్బందిగా మారుతుంది. ఈ ఇబ్బందులన్నీ మరీ ముదిరిపోతే తీవ్ర వ్యాధుల పాలు కావాల్సిఉంటుంది.

మెరుగుపరుచుకోవడం ఎలా..
► మనం చేసే ప్రతి దైనందిన కార్యక్రమాల్లో సరైన భంగిమలో శరీరాన్ని ఉంచడం చాలా అవసరం అని గుర్తించండి. 
► చురుగ్గా ఉండడం, తేలికపాటి వ్యాయామాలు, యోగాలాంటి అభ్యాసాలు, అధిక బరువు పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. 
► దీంతో పాటు హైహీల్స్‌ అలవాటు మానుకోవడం, ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం, నిల్చోవడం చేయకుండా శరీరాన్ని అప్పుడప్పుడు కదిలించడం, కంప్యూటర్, టీవీ వంటివి చూసేటప్పుడు లేదా టేబుల్‌ మీల్స్‌ చేసేటప్పుడు మెడను సరైన ఎత్తులో ఉంచుకోవడం ద్వారామెడపై భారం లేకుండా చేయాలి.
► ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోవాల్సివస్తే మధ్యలో నడుస్తుండడం లేదా శరీరాన్ని మెల్లగా స్ట్రెచ్‌ చేయడం, కూర్చున్నప్పుడు పాదాలు మెలికవేసుకోకుండా భూమిపై సమాంతరంగా ఉంచడం, భుజాలను రిలాక్స్‌ మోడ్‌లో ఉంచడం, కూర్చున్నా లేదా పడుకున్నా నడుముకు తగిన సపోర్ట్‌ ఇచ్చే ఏర్పాటు చేసుకోవడం అవసరం.
► సెల్‌ మెసేజ్‌ చూసేటప్పుడు, గేమ్స్‌ ఆడేటప్పుడు తల వంచకుండా (ఇలా ఎప్పుడూ తలొంచుకొని మొబైల్‌లో మునిగిపోతే మెడ పట్టేస్తుంది. దీన్ని టెక్ట్స్‌ నెక్‌ అంటారు) తలకు సమాంతరంగా ఫోన్‌ను పైకి లేపి చూడడం, నడిచేటప్పుడు నిటారుగా తలెత్తుకు నడవడం వంటి పద్ధతులతో సరైన పోశ్చర్‌ పాటించవచ్చు.
► బాడీ పోశ్చర్‌ బాగా దెబ్బతిన్నదనిపిస్తే డాక్టర్‌ సలహాతో కాల్షియం, విటమిన్‌ డీ సప్లిమెంట్స్, తేలికపాటి పెయిన్‌కిల్లర్స్‌ వాడవచ్చు. బాడీ భంగిమను నిలబెట్టే ఉపకరణాలు(పోశ్చర్‌ బెల్ట్స్‌ లాంటివి) వాడవచ్చు.
► మరీ ఎక్కువగా ఇబ్బందులుంటే అలెగ్జాండర్‌ టెక్నిక్‌ టీచర్స్, ఫిజియోథెరపిస్ట్, ఖైరోప్రాక్టర్, ఓస్టియోపతీ ప్రాక్టీషనర్‌ సహాయం తీసుకోవాలి. అవసరమైతే వీరు సూచించే ఎలక్ట్రోథెరపీ, డ్రైనీడిలింగ్, మసాజింగ్, జాయిట్‌ మొబిలైజేషన్‌ లాంటి విధానాలు పాటించాలి. 
► స్మార్ట్‌ పోశ్చర్, అప్‌రైట్‌ లాంటి మొబైల్‌ యాప్స్‌లో సరైన భంగిమల గురించి, గుడ్‌పోశ్చర్‌ మెయిన్‌టెయిన్‌ చేయడం గురించి వివరంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement