back bone
-
ఎంత ఖర్చయినా వైద్యం చేయించండి: సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారి సాయిలక్ష్మీచంద్రకు ప్రభుత్వం పూర్తివైద్యం చేయిస్తుందని ఆమె తల్లి ఆరుద్రకు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన శుక్రవారం కాకినాడకు చెందిన రాజులపూడి ఆరుద్రతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. అనారోగ్యానికి గురైన తన కుమార్తెను ఆదుకోవాలంటూ రెండురోజుల కిందట ఆరుద్ర సీఎం కార్యాలయానికి విన్నవించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ పరామర్శించి వివరాలు తెలుసుకుని సీఎంకు నివేదించారు. దీంతో మరోసారి ఆమెతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని సీఎం జగన్ తన కార్యదర్శి ధనుంజయరెడ్డిని ఆదేశించారు. కలెక్టర్ డిల్లీరావు స్వయంగా ఆరుద్రను సీఎం కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయిలక్ష్మీచంద్ర వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని, ఈమేరకు సీఎం ఆదేశాలు జారీచేశారని ధనుంజయరెడ్డి ఆమెకు వివరించారు. జీవనోపాధి కోసం ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి.. ఆమె సమక్షంలోనే కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. స్థిరాస్తిని అమ్ముకునే క్రమంలోను ఎవరైనా ఇబ్బందిపెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీకి సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని, నిరాశకు గురికావద్దని ధైర్యం చెప్పారు. అనంతరం ఆరుద్ర మాట్లాడుతూ తనలాంటి నిస్సహాయులకు సీఎం అండగా నిలుస్తారనే ధైర్యం, నమ్మకంతోనే ఇక్కడికి వచ్చానన్నారు. తన కుమార్తెకు వైద్యం చేయించడంతోపాటు తనకు ఉద్యోగం ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రెండురోజులుగా అధికారులు ఎప్పటికప్పుడు తన యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. -
శ్రీలంక బాలికకు అరుదైన శస్త్ర చికిత్స
సాక్షి, చెన్నై: శ్రీలంకకు చెందిన 12 ఏళ్ల బాలికకు చెన్నై క్రోమ్ పేటలోని మల్టీ స్పెషాలిటీ క్వాటర్నరీ కేర్ రేలా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు. బుధవారం ఈ చికిత్స గురించి ఆర్టోపెడిక్స్ హెడ్ పార్థసారథి శ్రీనివాసన్ మీడియాకు వివరించారు. శ్రీలంకకు చెందిన సాన్వి(12) మూడేళ్లుగా విపరీతమైన వెన్ను నొప్పితో బాధ పడుతూ వచ్చింది. దీంతో చెన్నై రేలాకు తీసుకొచ్చారు. స్కోలియోసిస్ బారిన ఆ బాలిక పడ్డట్లు గుర్తించారు. ఈ కారణంగా వెన్నెముక 140 డిగ్రీల వంపుతో ఎస్ ఆకారానికి చేరింది. ఆమె బరువు 30 కేజీలు మాత్రమే ఉండటం రక్తం పరిమాణం 2.5 లీటర్లు ఉండడంతో నిపుణులతో కూడిన వైద్య బృందం శస్త్ర చికిత్స నిర్వహించారు. ఎస్ ఆకారం నుంచి వెన్నెముక నిటారుగా యథాస్థితికి చేర్చారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో బాలిక ఇకపై ఎత్తు పెరగడమే కాకుండా, తల భాగాన్ని పైకి కిందికి కదిలించే అవకాశం లభించిందన్నారు. చదవండి: సిద్ధూ హత్య కేసు: మాస్టర్ మైండ్ అతనేనన్న ఢిల్లీ పోలీసులు -
మీ భంగిమలను ఇలా చెక్ చేసుకోండి!
జీవ పరిణామ క్రమంలో ఉన్నత పరిణామం చెందిన జీవి మనిషి. ఇతర ఏ జంతువులకు లేని విధంగా నిటారుగా నిల్చోడం, నిటారుగా పరిగెత్తడం, కూర్చోగలగడం మనిషికే ప్రత్యేకం. ఇందుకు మన శరీరం పొందిన పరిణామ క్రమం కారణం. అయితే మనం కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా సరైన బాడీపోశ్చర్ ( శరీర భంగిమ) మెయిన్‌టెయిన్ చేయకపోతే కొత్త కొత్త ఇబ్బందులు కొనితెచ్చుకోవడం జరుగుతుంది. సరైన శరీర భంగిమ అంటే గుడ్ పోశ్చర్ మెయిన్‌టెయిన్ చేయడం హెల్తీలైఫ్కు చాలా అవసరం. అసలు గుడ్‌పోశ్చర్ అంటే... వెన్నెముక చుట్టూ ఉండే కండరాలన్నీ బ్యాలెన్స్డ్గా ఉండడం, కండరాలకు ఎలాంటి నొప్పులు రాకుండా శరీరాన్ని తీరుగా ఉంచడమే గుడ్ పోశ్చర్. మన డైలీ లైఫ్‌లో ఎదురయ్యే శారీరక ఒత్తిడి కండరాలు, ఎముకలపై పడకుండా జాగ్రత్తపడడమన్నమాట! ఎలా చెక్ చేయాలి.. మనం సరైన భంగిమ లేదా పోశ్చర్ మెయిన్‌టెయిన్ చేస్తున్నామో లేదో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. కూర్చున్నప్పుడు రెండు పాదాలు సమాంతరంగా నేలపై ఉన్నాయా? రెండు పిరుదులపై సమాన భారం పడుతోందా? వెన్నెముక నిటారుగా ఉందా? భుజాలను చెవులకు సమాంతరంగా రిలాక్స్‌గా ఉంచామా? నిలుచున్నప్పుడు మోకాలి జాయింట్లు లాక్ అవకుండా నిల్చుంటున్నామా? పడుకున్నప్పుడు శరీరం సమాంతరంగా ఉంటోందా? వంటివి చెక్ చేయడం ద్వారా పోశ్చర్ మెయిన్‌టెయిన్ అవుతుందా, లేదా తెలిసిపోతుంది. హెల్త్‌పై ప్రభావం.. సరైన పోశ్చర్ మెయిన్‌టెయిన్ చేయకపోతే, వెన్నెముక పెళుసుగా మారి, ఈజీగా దెబ్బతింటుంది. కండరాల నొప్పులు ఆరంభమై క్రమంగా పెరిగిపోతాయి. మెడ, భుజం, వెన్ను నొప్పులు పర్మినెంట్‌గా ఉండిపోతాయి. కీళ్ల కదలికలు దెబ్బతింటాయి. క్రమంగా ఈ మార్పులు జీర్ణవ్యవస్థను మందగింపజేస్తాయి. ఆపైన శ్వాస ఆడడం ఇబ్బందిగా మారుతుంది. ఈ ఇబ్బందులన్నీ మరీ ముదిరిపోతే తీవ్ర వ్యాధుల పాలు కావాల్సిఉంటుంది. మెరుగుపరుచుకోవడం ఎలా.. ► మనం చేసే ప్రతి దైనందిన కార్యక్రమాల్లో సరైన భంగిమలో శరీరాన్ని ఉంచడం చాలా అవసరం అని గుర్తించండి. ► చురుగ్గా ఉండడం, తేలికపాటి వ్యాయామాలు, యోగాలాంటి అభ్యాసాలు, అధిక బరువు పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. ► దీంతో పాటు హైహీల్స్ అలవాటు మానుకోవడం, ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం, నిల్చోవడం చేయకుండా శరీరాన్ని అప్పుడప్పుడు కదిలించడం, కంప్యూటర్, టీవీ వంటివి చూసేటప్పుడు లేదా టేబుల్ మీల్స్ చేసేటప్పుడు మెడను సరైన ఎత్తులో ఉంచుకోవడం ద్వారామెడపై భారం లేకుండా చేయాలి. ► ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోవాల్సివస్తే మధ్యలో నడుస్తుండడం లేదా శరీరాన్ని మెల్లగా స్ట్రెచ్ చేయడం, కూర్చున్నప్పుడు పాదాలు మెలికవేసుకోకుండా భూమిపై సమాంతరంగా ఉంచడం, భుజాలను రిలాక్స్ మోడ్‌లో ఉంచడం, కూర్చున్నా లేదా పడుకున్నా నడుముకు తగిన సపోర్ట్ ఇచ్చే ఏర్పాటు చేసుకోవడం అవసరం. ► సెల్ మెసేజ్ చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు తల వంచకుండా (ఇలా ఎప్పుడూ తలొంచుకొని మొబైల్లో మునిగిపోతే మెడ పట్టేస్తుంది. దీన్ని టెక్ట్స్ నెక్ అంటారు) తలకు సమాంతరంగా ఫోన్‌ను పైకి లేపి చూడడం, నడిచేటప్పుడు నిటారుగా తలెత్తుకు నడవడం వంటి పద్ధతులతో సరైన పోశ్చర్ పాటించవచ్చు. ► బాడీ పోశ్చర్ బాగా దెబ్బతిన్నదనిపిస్తే డాక్టర్ సలహాతో కాల్షియం, విటమిన్ డీ సప్లిమెంట్స్, తేలికపాటి పెయిన్‌కిల్లర్స్ వాడవచ్చు. బాడీ భంగిమను నిలబెట్టే ఉపకరణాలు(పోశ్చర్ బెల్ట్స్ లాంటివి) వాడవచ్చు. ► మరీ ఎక్కువగా ఇబ్బందులుంటే అలెగ్జాండర్ టెక్నిక్ టీచర్స్, ఫిజియోథెరపిస్ట్, ఖైరోప్రాక్టర్, ఓస్టియోపతీ ప్రాక్టీషనర్ సహాయం తీసుకోవాలి. అవసరమైతే వీరు సూచించే ఎలక్ట్రోథెరపీ, డ్రైనీడిలింగ్, మసాజింగ్, జాయిట్ మొబిలైజేషన్ లాంటి విధానాలు పాటించాలి. ► స్మార్ట్ పోశ్చర్, అప్రైట్ లాంటి మొబైల్ యాప్స్‌లో సరైన భంగిమల గురించి, గుడ్‌పోశ్చర్ మెయిన్‌టెయిన్ చేయడం గురించి వివరంగా ఉంటుంది. -
దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగమే వెన్నెముక
► ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి న్యూశాయంపేట: భారత దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగం వెన్నెముక అని, బ్యాంకింగ్ రంగంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం సామన్యుడు సైతం అర్థం చేసుకున్నప్పుడే సార్థకత అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి అన్నారు. గురువారం ఖిలావరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి కళాశాలలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ ప్రభావం బ్యాంకింక్ రంగంపై ఉందన్నారు. ఫలితంగా ప్రైవేటు బ్యాంకులు ఆవిర్భవించాయని, వినియోగదారులకు సేవలందించడంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల మధ్య పోటీతత్వం పెరిగిందన్నారు. ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువైన నేపథ్యంలో సామాన్యులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ విద్యార్థులపై ఉందన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శంకరయ్య మాట్లాడుతూ కంప్యూటరైజేషన్ వల్ల బ్యాంకింగ్ సేవలు వేగవంతమై వినియోగదారులు సులభమైన సేవలు పొందుతున్నారన్నారు. ఈ సదస్సులో తెలంగాణలోని వివిధ ఎంబీఏ విద్యాసంస్థల నుంచి 80 మంది అధ్యాపకులు, విద్యార్థులు పలు అంశాల్లో పత్ర సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో కేయూ ప్రిన్సిపాల్ శర్మ, ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం సూర్యనారాయణ, వాగ్దేవి విద్యాసంస్థలపాలనాధికారి సత్యపాల్‌రెడ్డి, డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ప్రిన్సిపాల్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
పేరుకు పర్యాటకం.. ఆ వెనుక నాటకం
ఏలూరు రూరల్ : పేదవాడికి 50 గజాల స్థలం ఇవ్వాలంటే జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మెల్యే, ఎంపీ తదితరులతో కూడిన అసైన్డ్ కమిటీ అంగీకరించాలి. అప్పుడే లబ్ధిదారుణ్ణి గుర్తించి రెవెన్యూ అ«ధికారులు భూమిని పంపిణీ చేస్తారు. కానీ.. ఇవేమీ లేకుండానే పర్యాటక కాంట్రాక్టర్‌కుS8 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ధారాదత్తం చేశారు. సదరు వ్యక్తి ఆ భూమిలో చేపల చెరువులు తవ్వి దర్జాగా సాగు చేపట్టాడు. ఏలూరు మండలం గుడివాకలంకలో ఈ అక్రమ వ్యవహారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కొల్లేరు సరస్సును వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు సేద తీరేందుకు వీలుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గుడివాకలంక సమీపంలో ‘హరిత’ పేరిట రిసార్ట్స్ నిర్మించింది. పర్యాటకులను ఆకర్షిం చేందుకు నీటిమధ్యలో రెండు అంతస్తుల చొప్పున నాలుగు భవనాలు కట్టారు. ఒక్కొక్క భవనంలో నాలుగు గదులు ఉండేలా డిజైన్ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.కోటిన్నర వెచ్చిం చింది. రిసార్ట్స్‌లో విడిది చేసే పర్యాటకులు కొల్లేరు అందాలు తిలకించేందుకు వీలుగా బోటు షికారు ఏర్పాటు చేసింది. రిసార్ట్ వెనుక నుంచి నేరుగా కొల్లేరు సరస్సులోకి వెళ్లేందుకు ప్రభుత్వానికి చెందిన 212/1 సర్వే నంబర్లో 4.12 ఎకరాలు, 212/2లో 26 సెంట్లు, 213/3లో 3 ఎకరాల 60 సెంట్ల భూమిలో కాలువ తవ్వారు. రిసార్ట్స్ నిర్వహణను పర్యాటక శాఖ ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్‌కు ఇచ్చింది. సదరు వ్యక్తి టీడీపీ నేతల అండదండలతో రిసార్ట్స్ వెనుక బోటు షికారుకు కేటాయించిన ప్రభుత్వ భూమిపై కన్నేశాడు. కొల్లేరులోకి వెళ్లేందుకు వీలుగా తవ్విన కాలువకు గట్లువేసి.. ఆ కాలువతోపాటు సమీపంలోని భూమిని చేపల చెరువులుగా మార్చేశాడు. ఈ విషయమై స్థానికులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎన్ఎస్ఆర్ రవిచంద్రకు ఫిర్యాదు చేయగా ఆయన వెళ్లి చెరువులను పరిశీలించారు. అయినా, అక్కడ సాగుతున్న అక్రమ వ్యవహారానికి అడ్డుకట్ట పడలేదు. రూ.లక్షల్లో లీజు గుడివాకలంక ప్రాంతంలో ఎకరం చేపల చెరువు లీజు ఏడాదికి రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు ఉంది. ఈ లెక్కన రిసార్ట్స్ కాంట్రాక్టర్ ఆక్రమించిన 8 ఎకరాల ద్వారా ఏడాదికి కేవలం లీజు రూపంలోనే రూ.5.60 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు లబ్ధి పొందుతున్నట్టు అంచనా. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులను సంప్రదించగా.. సదరు వ్యక్తికి రిసార్ట్స్ నిర్వహణ బాధ్యతను పర్యాటక శాఖ అప్పగించిందని చెప్పారు. ఆ భూమిని లీజు లేదా ఏ ఇతర రూపంలోనూ అతడికి కేటాయించలేదన్నారు. సెక్రటేరియట్ నుంచి అనుమతి తెచ్చుకున్నాడట ఆ భూమిని పరిశీ లించాను. అది పూర్తిగా ప్రభుత్వ భూమే. రిసార్ట్స్ యజమానితో మాట్లాడాను. రిసార్ట్స్‌తోపాటు భూమిని కూడా తనకు లీజుకు ఇచ్చినట్టు కాంట్రాక్టర్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఏపీ సెక్రటేరియట్ అధికారులు జారీ చేసిన మంజూరు పత్రాలు ఉన్నాయని, వాటిని చూపిస్తానని అన్నారు. – ఎన్ఎస్ఆర్ రవిచంద్ర, ఆర్ఐ -
వెన్నునొప్పి అశ్రద్ధ చేస్తే వైకల్యమే
వెన్నుపూస ఒక పవర్‌హౌస్ లాంటిది. దీని ద్వారా కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడకు పవర్ సప్లై అవుతుంది. శరీరం మొత్తాన్ని స్థిరంగా ఉండేలా చేస్తుంది. కొన్ని కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్ హౌస్ నిర్జీవం అవుతుంది. దీని వలన భుజం, మెడ నొప్పులు, వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీనపడినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. వీటన్నింటికీ పరిష్కారం కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలే అంటున్నారు. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పి.కృష్ణ ప్రసాద్. మన జీవితం ఒక్కోసారి నడి సముద్రంలో నావలా ఇరుక్కుపోతుంది. ఎటు పోవాలో దిక్కుతోచదు. క్రమేపీ అన్ని దారులూ మూసుకుపోతాయి. తీవ్రమైన మెడ, నడుము నొప్పితో పాటు క్రమేిపీ రెండు చేతుల్లో విపరీతమైన తిమ్మిర్లు వస్తాయి. ఒక దశలో బలం కోల్పోయి పట్టుతప్పి తెలియకుండానే వస్తువులు జారిపోతుంటాయి. ప్రతిసారీ విశ్రాంతి తీసుకోవాలంటే కుదరని పరిస్థితుల్లో పని ఒత్తిడి పెరిగితే కళ్లు తిరుగుతాయి. పడుకున్నప్పుడు తలకింద పెట్టుకున్న చేతులు కొద్ది సేపటికి మొద్దుబారినట్లుగా ఉంటాయి. దీంతోపాటు తీవ్రమైన నడుము నొప్పి, రెండు కాళ్లలో తిమ్మిర్లు, పోట్లు, చెమట వంటివి వస్తాయి. నడవాలంటే తూలి పడిపోతున్న భయం, వెన్ను, నడుం, మెడతో పాటు, అధిక బరువు, మధుమేహం తదితర సమస్యలతో బాధపడుతుంటారు. ఆయుర్వేదంలో వీటిని వాతానికి సంబంధించిన వ్యాధులుగా పరిగణిస్తారు. సర్జరీతో ఒరిగేదేమిటి? వెన్నునొప్పితో వెళితే మొదటిగా అల్లోపతి పెయిన్ కిల్లర్‌స, బెడ్ రెస్ట్ తీసుకోమంటారు. పెయిన్ కిల్లర్‌స అదేపనిగా వాడటం వల్ల దుష్ఫలితాలు అనేకం. కడుపు ఉబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. దీంతో ఇక సర్జరీకి వెళ్లినా శాశ్వత పరిష్కారం దొరకదు. ఏం జరుగుతుంది? మొదట్లో నొప్పి వెన్ను ప్రాంతంలోనే వస్తుంది. వెన్ను భాగంలో కండరాలు బలహీనమవుతాయి. తరువాత మెడ, నడుము, వెన్నుపూసలో డిస్క్ పక్కకు జరిగి వెన్నుపూస నరాల మీద ఒత్తిడి పడుతుంది. కారణం మెడ, నడుము దగ్గరున్న కండరాలు బలహీనపడటమే. ఈ కండరాలన్నీ వెన్నుపాముతో సంబంధం కలిగి ఉంటాయి. ఆయుర్వేదం ఏం చేస్తుంది? ఆయుర్వేదంలో వెన్నునొప్పి రావడానికి కారణాలను పరీక్షలతో తెలుసుకుంటారు. తరువాత ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పిన కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, మర్మ చికిత్సలు, మేరు చికిత్సలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విధానంలో ఔషధాలతో తయారు చేసిన అత్యంత సారవంతమైన కేరళ నూనెలతో వెన్నుభాగం అంతా మర్దనచేసి కండరాలకు బలాన్నిచ్చే కటిబస్తి, గ్రీవబస్తి, కటిధార చికిత్సలు చేస్తారు. వీటితో పాటు పంచకర్మలో ముఖ్యమైన వస్తి, విరోచనం చికిత్సలు చాలా ముఖ్యం. వీటివల్ల నొప్పి రావటానికి ఉన్న దోషాలను సమూలంగా, శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పోతాయి. కనుక తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నవారు కేరళ ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సలతో పునఃశక్తి పొంది వెన్నెముక బలంగా తయారై... పవర్‌హౌస్ సక్రమంగా పనిచేసేట్టు చేయవచ్చు. అడ్రస్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్, వివరాలకు: డా॥పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352 E mail: krishnaprosad.6600@gmail.com