ఇల్లు తుడిచే మాప్‌ కాదు, బీబీక్యూ మాప్‌ సాస్‌: వీడియో వైరల్‌ | Viral Video Of A Mop Being Used For Spreading Sauce On BBQ | Sakshi
Sakshi News home page

ఇల్లు తుడిచే మాప్‌ కాదు, బీబీక్యూ మాప్‌ సాస్‌: వీడియో వైరల్‌

Published Fri, May 10 2024 3:13 PM | Last Updated on Fri, May 10 2024 3:22 PM

Viral Video Of A Mop Being Used For Spreading Sauce On BBQ

ఇంటర్నెట్‌లో ఫుడ్‌కు సంబంధించిన అనేక వీడియోలు సందడి చేస్తూ ఉంటాయి. వీటిల్లో కొన్ని ఆకర్షణీయంగా ఉంటే, మరికొన్ని మాత్రం యాక్‌.. అనిపిస్తుంటాయి  కదా. అలాంటి  ఇంట్రస్టింగ్‌ వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు  కొడుతోంది.

 దోసల పెనం మీద  చీపురు కట్టతో తుడవడం చూశాం. మొన్నఒక వ్యక్తి అనేక  చికెన్‌ కాల్చడం కోసం పొడవైన తుడుపుకర్రను వాడేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అయింది. తాజాగా ఒక మహిళ మాంసాన్ని గ్రిల్‌ చేస్తూ, మాప్‌ స్టిక్‌ వాడడం నెటిజన్లకు షాకిచ్చింది. ఈ మేరకు ఆమె షేర్‌ చేసిన వీడియో 45 మిలియన్లకు పైగా వ్యూస్‌ను  సొంతం  చేసుకంది. 47వేలకు  పైగా  కామెంట్లు వెల్లువెత్తాయి.

stadiumchef ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఒక మహిళా చెఫ్‌ సాస్ కంటైనర్‌లో తుడుపుకర్రను ముంచి,  తరువాత బీబీక్యూలోని  మీట్‌పై పూసింది. బీబీక్యూ  మాప్‌ సాస్‌ అనే క్యాప్షన్‌తో షేర్‌ ఈ చేసిన వీడియోపై  వివరణ కూడా ఇచ్చింది. ఇలాంటి  మాప్స్‌ గ్రిల్డ్‌ మాంసాన్ని చేసేందుకు స్పెషల్‌గా తయారు  చేస్తారని వివరణ ఇచ్చింది. పెద్దమొత్తంలో స్మోక్డ్‌  మీట్‌ చేసేటపుడు ఇవి ఉపయోగపడతాయి. మీరు దక్షిణాదికి చెందినవారు కాకపోతే, అర్థం కాదు అని కూడా ఆమె తెలిపింది. 

ఇంత వివరణ ఇచ్చినా ఇది చూసి వెంటనే కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘‘అస్సలు హైజీనిక్‌గా లేదు..బాబోయ్‌ బాక్టీరియా మయం రా బాబూ.. నేను తిన’’ అని  ఒక యూజర్‌  కమెంట్‌ చేయగా, చాలామంది బీబీక్యూ మాప్‌ను సమర్ధించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement