సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టే రోడ్లు, ఇతర ప్రభుత్వ పనుల్లో పూర్తి పారదర్శకత తీసుకొచ్చి అక్రమాలను అరికట్టేందుకు ఆ శాఖ ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. పనులకు సంబంధించి ముందస్తు అంచనాల (ఎస్టిమేట్స్) తయారీ, టెండర్లు, జరిగిన పనికి ఎం –బుక్ నిర్వహణ అంతా ఆన్‌లైన్ విధానంలోకి తేనుంది. ఇందుకోసం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎన్‌సీ బాలూ నాయక్, ముఖ్య ఇంజనీరింగ్ అధికారులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనుభవం, నైపుణ్యం ఉన్న కొందరు అధికారులు బృందాలుగా ఏర్పడి ఈ సాఫ్ట్‌వేర్ ఎలా ఉండాలో నివేదికను కూడా సిద్ధం చేశారు. నూతన సాఫ్ట్‌వేర్‌తో పనుల అంచనాల రూపకల్పన, టెండర్ల ప్రక్రియ, ఎం–బుక్ నిర్వహణలో పారదర్శకత ఉంటుందని, అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. పనుల్లో నాణ్యత కూడా పెరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment