ముంబయి : స్టాక్ మార్కెట్లు మంగళవారం సాయంత్రం స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 43 పాయింట్ల నష్టంతో 25వేల 775 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 7వేల 831 పాయింట్ల వద్ద ముగిసింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్, జీఎంఆర్ ఇన్ఫ్రా, గాటీ, ఇండియా సిమెంట్, జీవీకే పవర్ కంపెనీల షేర్లు లాభాలు మూటగట్టుకన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాక్స్ ఇండియా, ఇమానీ, అదానీ పోర్స్ కంపెనీలు భారీ నష్టాలు చవిచూశాయి.
గురునానక్ జయంతి సందర్భంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. గురువారం మళ్లీ మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.
మరో వైపు గత రెండు రోజులుగా తగ్గిన బంగారంధర మంగళవారం స్పల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.25,740కి చేరింది. వెండి ధర కూడా పెరిగింది. రూ.350 పెరగడంతో కేజీ వెండి ధర రూ.34,150కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో సానుకూల వాతావరణం ఉండంతో దేశీయ మార్కెట్ లోకూడా బంగారం, వెండి డిమాండు పెరిగిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
విచూశాయి.