
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా మెట్రో రవాణా నష్టాల్లో నడుస్తోందని, ఈ పరిస్థితుల్లో తమకు సహకారం అందించాలని ఎల్‌అండ్ టీ ప్రతినిధులు సీఎం కె.చంద్రశేఖర్‌రావును కోరారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైలు రవాణా అంశంపై చర్చించేందుకు శుక్రవారం ప్రగతి భవన్‌లో ఎల్‌అండ్‌టీ సంస్థ సీఈవో, ఎండీ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వారి అభ్య ర్థనపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఎల్‌అండ్‌టీ సంస్థకు ఏ మేరకు సహాయం చేయవచ్చో పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ అంశంపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు.