
యాపిల్ యాప్ స్టోర్ కు కొత్తరూపం
మారుతున్న నెటిజన్ల అభిరుచులకు కనుగుణంగా తన యాప స్టోర్ ను వినూత్నంగా తీర్చిదిద్దేందుకు యాపిల్ యోచిస్తోంది. దీనికోసం ఓ సీక్రెట్ టీమ్ ని కూడా నియమించిందట.
మారుతున్న నెటిజన్ల అభిరుచులకు కనుగుణంగా తన యాప్ స్టోర్ ను వినూత్నంగా తీర్చిదిద్దేందుకు యాపిల్ యోచిస్తోంది. దీనికోసం భారీ కసరత్తులే చేస్తోంది. ఇప్పటివరకూ ఉన్న ఐఓఎస్ యాప్ స్టోర్ స్వరూపాన్ని , రూపురేఖలు మార్చి కొత్తదనంతో నెటిజన్ల ముందుకు తీసుకురావాలని యాపిల్ ఇంక్ నిర్ణయించింది. దీనికోసం ఓ సీక్రెట్ టీమ్ ని కూడా నియమించిందట.
దాదాపు 100మంది ఉండే ఈ టీమ్ లో యాప్ స్టోర్ డిజైన్ మార్పులు గురించి విశ్లేషించి కొత్తగా రూపుదిద్దనున్నారట. ఈ ప్రాజెక్టులో పాల్గొనే వారందరూ యాపిల్ అడ్వర్టైజింగ్ గ్రూప్ ఐయాడ్ కు చెందినవాళ్లేనని బ్లూమ్ బర్గ్ తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టుకు యాపిల్ వైస్ ప్రెసిడెంట్ టోడ్ థెరిసీ అధినేతగా బాద్యతలు నిర్వర్తించనున్నారు. గూగుల్ మోడల్ మాదిరిగా ఐఫోన్ తయారీ సంస్థ కూడా పెయిడ్ సెర్చస్ అనుగుణంగా ఈ యాప్ స్టోర్ ను డిజైన్ చేయనుంది. యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయంతో యాపిల్ స్టోర్ సెర్చ్ ఓ కొత్త రూపం దాల్చనుంది. అన్నీ యాపిల్ ప్లాట్ ఫామ్ లో ఉండే స్టోర్ ల మెరుగుదలకు ఈ టీమే బాధ్యత నిర్వర్తించనుందని తెలుస్తోంది.