బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో ఏషియాలోనే అత్యంత ధనవంతుడిగా మారిన గౌతమ్ అదానీ కేవలం ఒక్క రోజు మాత్రమే ఆ స్థానంలో ఉండగలిగారు. 24 గంటలు గడిచేసరికి ముకేశ్ అంబారీ మరోసారి దూసుకువచ్చి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఇద్దరి సంపదలో తేడా రావడంతో ముకేశ్ పైకి ఎగబాకగా ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ ఏషియా నంబర్ 2, ప్రపంచంలో 11 స్థానానికి పరిమితమయ్యారు.
2022 ఫిబ్రవరి 9 బుధవారం ఉదయం బ్లూంబర్గ్ ఇండెక్స్ జాబితాలో ముకేశ్ అంబానీ సంపద 89.2 బిలియన్ డాలర్లకుగా నమోదు అయ్యింది. క్రితం రోజు ఈ విలువ 87.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక గౌతమ్ అదానీ సంపద 86.3 బిలియన్ డాలర్లుగా ఉంది. మునపటి జాబితాలో ఈ మొత్తం 88.5 బిలియన్లుగా ఉండేది. ఒక్క రోజు వ్యవధిలో ముకేశ్ సంపదలో 1.33 బిలియన్ డాలర్లు వచ్చి జమ అవగా అదానీ ఖాతా నుంచి 2.16 బిలియన్ డాలర్లు కరిగిపోయాయి. దీంతో ముకేశ్ ఏషియా నంబర్ 1 స్థానంతో పాటు ప్రపంచం కుబేరుల్లో పదో స్థానానికి మరోసారి చేరుకున్నారు.
బ్లూంబర్గ్ జాబితాలో అంబానీ, అదానీలు వరుసగా 10వ 11వ స్థానాల్లో ఉండగా టాప్ 100 జాబితాలో 38వ స్థానంలో అజీమ్ ప్రేమ్‌జీ (33.8 బిలియన్ డాలర్లు), 48వ స్థానంలో శివ్‌నాడార్ (29 బిలియన్ డాలర్లు), 79వ స్థానంలో రాధాకిషన్ దమానీ (21.2 బిలియన్ డాలర్లు), 82వ స్థానంలో లక్ష్మీ మిట్టల్ (21 బిలియన్ డాలర్లు)లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment