ధనవంతుల జాబితాలో అగ్రస్థానం కోసం పోటీపడుతున్న ఇండస్ట్రీ లిస్ట్ గౌతమ్ అదానీ అనుకున్నది సాధించారు. ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముఖేష్ అంబానీని.., గౌతమ్ అదానీ బీట్ చేశారు. 2015 నుంచి ప్రతి ఏడాది ఇండియాలో అత్యంత సంపన్నుడిగా ప్రథమస్థానంలోనే కొనసాగుతున్నారు. అయితే, తాజా గణాంకాల ప్రకారం రిలయన్స్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. దీంతో అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసిన ముదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదానీ కొండనే డీకొట్టారని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ స్థానంలో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. నివేదికల ప్రకారం ఏప్రిల్ 2020 నుండి అదానీ నికర విలువ బాగా పెరిగింది. మార్చి 18, 2020న అతని నికర విలువ 4.91 బిలియన్ డాలర్లు ఉండగా.. కేవలం 20 నెలల్లో గౌతమ్ అదానీ నికర విలువ 1808 శాతానికి(83.89 బిలియన్ డాలర్లు) పైగా పెరిగింది. అదే సమయంలో ముఖేష్ అంబానీ నికర విలువ 250 శాతం (54.7 బిలియన్ డాలర్లు)పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో అదానీ ప్రస్తుత నికర విలువ 88.8 బిలియన్ అని సూచించింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ కంటే కేవలం 2.2 బిలియన్ డాలర్లు తక్కువగా ఉంది.
అయితే బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, మంగళవారం (నవంబర్ 23) అదానీ సంపద 88.8 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు అంబానీ నికర సంపద 91 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ బుధవారంతో (నవంబర్ 24) బిలియనీర్ల జాతకాలు మారిపోయాయి. ఆరామ్‌కోతో డీల్ బ్రేక్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.77% పడిపోయాయి. అయితే అదానీ షేర్లు 2.34% జంప్ చేయడంతో అదానీ ఆస్తులు పెరిగి అంబానీ ఆస్తులు తగ్గుముఖం పట్టాయి.
ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం
ఆరామ్‌కోతో డీల్ బ్రేక్ తర్వాత రిలయన్స్ షేర్లు రోజురోజు క్షీణిస్తున్నాయి.1.07 శాతం తగ్గి రూ.2,360.70 వద్ద ఉన్నాయి. అదానీ గ్రూప్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2.94 శాతం పెరిగి రూ.1757.70 వద్ద ఉంది. అదానీ పోర్ట్స్ 4.87 శాతం పెరిగి రూ.764.75కి చేరుకుంది. అదానీ ట్రాన్స్‌మిషన్ 0.50 శాతం లాభపడి రూ.1,950.75కి చేరుకోగా, అదానీ పవర్ షేర్లు కూడా 0.33 శాతం పెరిగి రూ.106.25కి చేరాయి. దీంతో బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న అదానీ ప్రస్తుతం అంబానీని ఓవర్ టేక్ చేసి అగ్రస్థానానికి ఎగబాకారు.
చదవండి: ముఖేష్ అంబానీ కొత్త ఇల్లు..! ఎంతకు కొనుగోలు చేశారో తెలుసా..!
Comments
Please login to add a commentAdd a comment