
లెజెండరీ అమెరికన్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తెలిసే ఉంటుంది. ఆయన సంపద ఒక్కసారిగా ఆల్-టైమ్ గరిష్ట స్థాయిల్లోకి ఎగిసింది. బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ప్రకారం వారెన్ బఫెట్ మొత్తం సంపద 81.5 బిలియన్ డాలర్లు అంటే రూ.5.3 లక్షల కోట్లతో ఆల్-టైమ్ గరిష్టాలకు చేరుకున్నట్టు తెలిసింది. దీంతో బెర్క్ షైర్ హాత్వే చైర్మన్ ఆయన అత్యంత ధనికుల జాబితాలో మూడో స్థానంలోకి వచ్చేశారు.
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ అనంతరం వారెన్ బఫెట్ నిలిచినట్టు బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది. గత ఐదేళ్లలో వారెన్ బఫెట్ సంపద రూ.2.28 లక్షల కోట్లు పెరిగినట్టు తెలిపింది. అంటే ఏడాదికి రూ.45,684 కోట్లు ఆర్జించారని తెలిసింది. నెలకు రూ.8.68 లక్షలను, సెకనుకు రూ.14,467ను ఆయన ఆర్జిస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment