తైపీ: అమెరికా నావికా దళానికి చెందిన రెండు యుద్ధనౌకలు ఆదివారం తైవాన్ జలసంధి గుండా ప్రయాణించాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ వివాదాస్పద తైవాన్ పర్యటనతో అమెరికా, చైనా మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం తెలిసిందే.
ఇందుకు ప్రతిగా తైవాన్ చుట్టూ చాలా రోజుల పాటు చైనా యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను మోహరించి, భారీ సైనిక విన్యాసాలకు తెర తీసింది. ఆ తర్వాత తైవాన్ జలసంధిలో యూఎస్ యుద్ధనౌకల సంచారం ఇదే తొలిసారి. తైవాన్, ఇతర ప్రాంతీయ భాగస్వాములను తృప్తి పరిచేందుకే అమెరికా ఈ దుందుడుకు చర్యకు దిగిందంటూ చైనా విమర్శలు చేసింది.
చదవండి: (ఇల్లు లేక గ్యారేజీలో నిద్రించిన ప్రపంచ కోటీశ్వరుడి తల్లి)
Comments
Please login to add a commentAdd a comment