తైవాన్ : తైవాన్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రమాదంలో 46 మంది సజీవం దహనమైనారు. మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకాపెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
దక్షిణ తైవాన్‌లో కౌహ్సియుంగ్ నగరంలోని 13 అంతస్తుల టవర్ బ్లాక్‌లో ఉదయం 3 గంటలకు మంటలు చెలరేగాయని స్థానిక అగ్నిమాపక శాఖ తెలిపింది. బారీగా ఎగిసిన అగ్నికీలల్లో 46 మంది చిక్కుకొని అక్కడిడక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మంటలను అదుపులోకి తీసుచ్చిన రక్షణ, సహాయ దళాలు, బాధితుల కోసం గాలిస్తున్నారు. అగ్నిప్రమాదానికి ముందు పేలుడు శబ్దం వచ్చినట్లు పెద్ద శబ్దం వినిపించిందని సమీప నివాసితులు స్థానిక మీడియాకు తెలిపారు. భవన శిథిలాల్లో చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది నాలుగు గంటలకు పైగా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందనీ, భవనంలోనిని కింది అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.
At least 46 people have died in a 13-story building fire in Kaohsiung, Taiwan.
— Bloomberg Quicktake (@Quicktake) October 14, 2021
The cause remains unclear but firefighters noted the flames burned most intensely where a lot of clutter was piled, and eyewitnesses say they heard an explosion around 3am https://t.co/PYjqh1dkls pic.twitter.com/XNqnJqLmTX
Comments
Please login to add a commentAdd a comment