బీజింగ్: చైనా దాడి చేస్తే తైవాన్‌కు తాము రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై చైనా ధీటుగా స్పందించింది. చైనాను ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి అమెరికాకు కౌంటర్ ఇచ్చారు. తైవాన్ విషయంలో బైడెన్‌చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తైవాన్ వ్యవహారం చైనా సార్వభౌమాధికారం, అంతర్గత సమగ్రతకు సంబంధించినదని మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనా రాజీపడే అవకాశమే లేదని పేర్కొన్నారు.
సంబంధిత వార్త: ‘బీ కేర్‌ఫుల్’.. చైనాకు జో బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్
కాగా తైవాన్‌ను చైనా బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే తైవాన్‌కు తాము రక్షణ సహాయం కల్పిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేగాక ప్రమాదంతో ఆటలాడుతోందని చైనాను హెచ్చరించారు. టోక్యోలో జపాన్ ప్రధాన మంత్రితో సమావేశమైన జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌ను తమ భూభాగంగా పరిగణిస్తోన్న చైనా.. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా సాయం చేస్తుందా అనే ప్రశ్నపై బైడెన్ ఈ విధంగా సమాధానమిచ్చారు.
చదవండి: ఉక్రెయిన్ కోర్టు తొలిసారి కీలక తీర్పు.. యుద్ధ నేరానికి పాల్పడిన రష్యా సైనికుడికి..
ఇదిలా ఉండగా క్వాడ్ కూటమిలోని జపాన్, భారత్, ఆస్ట్రేలియా నాయకులతో బైడెన్ మంగళవారం భేటీ కానున్నారు. ఇక చైనా తైవాన్‌పై దాడి చేసే అవకాశాలున్న నేపథ్యంలో తమ సైనిక సంబంధాలను బలోపేతం చేయడంపై బైడెన్‌తో చర్చించినున్నట్టు జపాన్ ప్రధాని కిషిడా వ్యాఖ్యానించారు. బలమైన జపాన్.. అమెరికా-జపాన్ శక్తివంతమైన కూటమి ఈ ప్రాంతానికి చాలా కీలమైందని ఆయన పేర్కొన్నారు.
చదవండి: చనిపోయే స్థితిలో రష్యా ‘మాక్స్’.. ప్రాణాలు నిలిపిన ఉక్రెయిన్‌కు సాయం
Comments
Please login to add a commentAdd a comment