సాక్షి, విజయవాడ: బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్న చంద్రబాబుకు షాక్ తగిలింది. జనసేనతో జతకట్టిన చంద్రబాబు.. ఘోర ఓటమి భయం వెంటాడటంతో బీజేపీతో పొత్తు కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి. అయితే, పొత్తులపై ఏపీ బీజేపీ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది.
రెండు రోజుల సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు చేశామని, 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాల్లో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియని చేపట్టామని ఆమె పేర్కొన్నారు.
‘‘26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశాం. అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించాం. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తాం. పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారు. నిర్ణయిస్తారు. పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండ్‌దే’’ అని పురందేశ్వరి స్పష్టం చేశారు.
మరోవైపు, బీజేపీలోని చంద్రబాబు మద్దతుదారులు పొత్తు కోసం ఢిల్లీలో పైరవీ చేస్తున్నా.. ఢిల్లీ పెద్దలు మాత్రం అంగీకరించడంలేదని టాక్. బీజేపీలో చేరినప్పటికీ వీరు చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలే చెబుతుంటారు. అందుకోసమే చంద్రబాబు డైరక్టన్‌లోనే బీజేపీ వైపు నుంచి పొత్తు కోసం ప్రతిపాదన వచ్చేలా పైరవీలు సాగించారు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి సైతం పొత్తు కోసమే ప్రయత్నించారనే టాక్ నడిచింది. చంద్రబాబు మార్కు రాజకీయాలు అన్నీ తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం.
ఇదీ చదవండి: వల్లనోరిమామా నేనెళ్లను.. చీపురుపల్లి పోనంటున్న తమ్ముళ్లు
Comments
Please login to add a commentAdd a comment