సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెండు, మూడు రోజుల్లో పొత్తులపై స్పష్టత వస్తుందని తెలుగుదేశం సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు తూళ్ల దేవేందర్‌గౌడ్ తెలిపారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య సీట్లసర్దుబాటు కుదిరే అవకాశముందని, అదేసమయంలో మనం కూడా పొత్తులకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. వారం రోజుల్లో చోటుచేసుకునే మార్పుల అనంతరం.. రాజకీయ సమీకరణలు మారిపోతాయని ఆయన అన్నారు. గురువారం జిల్లాలోని మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశంలో దేవేందర్ మాట్లాడారు.
రాష్ట్రం ఇంకా సమైక్యంగా ఉందనే భ్రమల నుంచి బయటకు రావాలని, వ చ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులొడ్డాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున... ఎన్నికలు ఉంటాయా? లేదా అనే అంశంపై శుక్రవారం స్పష్టత వస్తుందని, ఎన్నికలు జరగకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 1985 నుంచి జిల్లా పరిషత్‌ను టీడీపీ గెలుస్తోందని, ఈ సారి కూడా స్థానాన్ని నిలబెట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎత్తులను చిత్తు చేసేలా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పార్టీని వదిలివెళ్లినవారిని ప్రజలు పట్టించుకోరని, నాయకులు వెళ్లిన కార్యకర్తలు పార్టీలోనే ఉన్నారని అన్నారు.
ఇబ్రీహ ంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇతర పార్టీల ప్రలోభాలకు కేడర్ లొంగకుండా పార్టీ నేతలు చూడాలన్నారు. కొంతమంది నేతల నిష్ర్కమణ కారణంగా పార్టీ నుంచి వెళ్లే ఆలోచన ఉన్న దిగువశ్రేణి నాయకులతో మాట్లాడి మనోధైర్యం చెప్పాలని సూచించారు.ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి స్వాగతం పలకాలని పేర్కొన్నారు. అతిత్వరలోనే నియోజకవర్గాల ఇన్‌చార్జిలను ప్రకటిస్తామని చెప్పారు. చివరి నిమిషంలో కొన్ని సెగ్మెంట్లకు కొత్త అభ్యర్థులు బరిలో దిగినా సహకరించాలని సూచించారు. గ్రూపు రాజకీయాలకు తావివ్వవద్దని, అభిప్రాయబేధాలను విడనాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు కేఎం వివేక్, నక్కా ప్రభాకర్‌గౌడ్, నందారెడ్డి, సుభాష్‌యాదవ్, చంద్రయ్య, ఉదయ్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పొత్తులుంటాయ్!
Published Thu, Mar 13 2014 11:27 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement