సై‘కిల్’ ! | cycle! | Sakshi
Sakshi News home page

సై‘కిల్’ !

Published Thu, May 15 2014 1:57 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

cycle!

సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో 50 జెడ్పీటీసీలకుగాను 39 స్థానాల్లో  వైఎస్సార్‌సీపీ గెలుపొంది సత్తా చాటింది. సహకార ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్, స్థానిక సంస్థలు ఇలా ఎన్నికలు ఏవైనా ప్రజలు వైఎస్ కుటుంబం వెన్నంటే నిలుస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు లేదా ఆ పార్టీ మద్దతుదారులను గెలిపించడమే లక్ష్యంగా ప్రజలు సంసిద్ధులుగా ఉన్నారు.
 
 జమ్మలమడుగు, రాయచోటి, పులివెందుల నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ దూకుడును  తెలుగుదేశం పార్టీ నిలువరించలే పోయింది.  ఆ మూడు నియోజక వర్గాల్లో ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా తెలుగుదేశం దక్కించుకోలేకపోయింది. 50 మండలాల్లో 39 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. 11స్థానాలకు మాత్రమే టీడీపీ పరిమితమైంది. మండ ల పరిషత్‌లలో సైతం 35చోట్ల వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యత లభించింది. 12 మండలాలను టీడీపీ కైవసం చేసుకోనుంది. కమలాపురం, ఓబులవారిపల్లె మండలాల్లో ఇరుపార్టీలకు సమానంగా ఎంపీటీసీలు దక్కాయి. రైల్వేకోడూరులో మాత్రమే హంగ్ ఏర్పడనుంది.
 
 టీడీపీ అభ్యర్థులకు శృంగభంగం..
 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు భిన్నమైన తీర్పునిచ్చారు. ఆయా అభ్యర్థుల సొంత మండలాల పరిధిలోని జెడ్పీటీసీలను వైఎస్సార్‌సీపీకి కట్టబెట్టారు. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సొంత ఎంపీటీసీ పలుగురాళ్లపల్లె వైఎస్సార్‌సీపీ వశమైంది. అలాగే ఆయన మండలంలోని బి.మఠం జెడ్పీటీసీ సైతం మూడువేల పైచిలుకు ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామగోవిందురెడ్డి విజయం సాధించారు. అలాగే పులివెందుల టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీష్‌రెడ్డి సొంత ఎంపీటీసీని వైఎస్సార్‌సీపీ వశపర్చుకుంది.

 వేంపల్లె జెడ్పీటీసీ సైతం భారీ ఆధిక్యతతో వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. కమలాపురం, జమ్మలమడుగు, రాయచోటి టీడీపీ అభ్యర్థుల సొంత మండలాల్లోని జెడ్పీటీసీలను కోల్పోయారు. వల్లూరు జెడ్పీటీసీ స్థానం నుంచి పుత్తా నరసింహారెడ్డి సోదరుడి తనయుడు పుత్తా లక్ష్మిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అక్కడ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అబ్బిరెడ్డి వీరారెడ్డి విజయం సాధించి టీడీపీకి సవాల్ విసిరారు. జమ్మలమడుగు అభ్యర్థి రామసుబ్బారెడ్డి సొంత మండలం పెద్దముడియంను వైఎస్సార్‌సీపీ మరోమారు వశపర్చుకుంది.
 
 అలాగే రాయచోటి టీడీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డి సొంత మం డలం లక్కిరెడ్డిపల్లెలో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేసి సత్తా చాటుకుంది. వీరితోపాటు జేఎస్పీ అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి సొంత మండలమైన  చిన్నమండెంలో సైతం వైఎస్సార్‌సీపీ సత్తా చాటుకుంది. రైల్వేకోడూరు జెడ్పీటీసీని వైఎస్సార్‌సీపీ దక్కించుకుని ఎమ్మెల్సీ బత్యాల స్పీడుకు వైఎస్సార్‌సీపీ నాయకులు బ్రేకులు వేశారు.
 
 సత్తాచాటుకున్న దేవగుడి సోదరులు..
 ఎన్నికల వ్యూహంలో తలపండిన నేతలుగా పేరున్న దేవగుడి సోదరులు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆరు జెడ్పీటీసీలు, మండల పరిషత్‌లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకొని మరోమారు పట్టునిలుపుకున్నారు. అన్ని మండలాలకు దేవగుడి సోదరులు ఇన్‌ఛార్జిలుగా వ్యవహరించి ఎన్నికల్లో చతురత ప్రదర్శించారు. మాజీ మంత్రి మైసూరారెడ్డి సహకారంతో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తనస్థాయిని గుర్తెరిగేలా మరోమారు యర్రగుంట్ల మండలం, జెడ్పీటీసీని వైఎస్సార్‌సీపీ వశం చేసుకున్నారు. జమ్మలమడుగులో దేవగుడి సోదరులకు తిరుగులేదని స్థానిక సంస్థల ఫలితాల ద్వారా రుజువు చేసుకున్నారు.
 
 శ్రీకాంత్ వ్యూహం...
 రాయచోటి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వ్యూహం ముందు తెలుగుదేశం పార్టీ కకావికలమైంది. మాజీ ఎమ్మెల్యేలు పాలకొండ్రాయుడు, రమేష్‌రెడ్డి, నారాయణరెడ్డి, ఆయన సోదరుడు రాంప్రసాద్‌రెడ్డిలు స్థానిక సంస్థల ఎన్నికల్లో  ఏకమై తలపడ్డారు. అయినప్పటికి అన్ని మండలాలు వైఎస్సార్‌సీపీ వశమయ్యాయి. సంబేపల్లెలో ఎర్రచందనం స్మగ్లర్ రెడ్డినారాయణను టీడీపీ తరపున బరిలో దింపి ధనప్రవాహన్ని పారించారు. అయినప్పటికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మల్లు నరసారెడ్డి ఈమారు జెడ్పీటీసీగా విజయం సాధించారు. పులివెందులలో వైఎస్సార్ సీపీకి ఎదురేలేదని స్థానిక సంస్థల ఎన్నికలు రుజువుచేశాయి.ప్రత్యర్థుల గోబెల్స్ ప్రచారానికి చెంపపెట్టుగా ఫలితాలు దర్శనమిస్తున్నాయి. టీడీపీ ఈమారు అక్కడ తీవ్ర అవమానభారం చవిచూసింది. అం దుకు నిదర్శనం వేంపల్లెలో 18ఎంపీటీసీలు, జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ వశం కావడమేనని పలువురు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement