పకడ్బందీ భద్రత
సాక్షి, నెల్లూరు: సుప్రీంకోర్టు ఆదేశాలతో పురపాలక ఓట్ల లెక్కింపు సార్వత్రిక ఎన్నికల అనంతరం మే 7 తర్వాత చేపట్టనున్నారు. అయితే ఈదఫా జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల ఓట్ల లెక్కింపు నె ల్లూరులో చేపట్టనున్నారు. గతంలో జిల్లాలోని ఆరు మున్సిపాల్టీలకు సం బంధించి ఓట్లను ఎక్కడికక్కడే లెక్కిం చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుప్రీం జోక్యంతో లెక్కింపు వాయిదా పడటం తో జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలకు సంబంధించిన ఈవీఎంలను నెల్లూరు డీకే మహిళా కళాశాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈవీఎంలతో పాటు కంట్రోల్ యూ నిట్లను కూడా నగరానికే తరలిస్తున్నా రు. ప్రధానంగా ఎక్కడిక్కడ భద్రత కల్పించడంలో ఇబ్బంది దృష్ట్యా ఒకే చోటకు తరలించే ప్రక్రియ చేపట్టారు.
పకడ్బందీ భద్రత
జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీలకు సంబంధించి ఈవీఎంలను డీకే మహి ళా కళాశాలలో భద్రపరచాల్సి రావడంతో ఎస్పీ నవదీప్‌సింగ్ నేతృత్వంలో పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టా రు. ఇప్పటి వరకు కేవలం నెల్లూరు కా ర్పొరేషన్ ఈవీఎంల భద్రతను దృష్టిలో పెట్టుకుని భద్రత చర్యలను తీసుకున్నారు.
ప్రస్తుతం ప్రణాళిక పూర్తిగా మా రిపోయింది. ఓట్ల లెక్కింపు రోజు ప్రత్యేకంగా పాసులు జారీ చేసి వారినే కేం ద్రంలోకి అనుమతించేలా చర్యలు చేపడుతున్నారు. ఆరు మున్సిపాల్టీలకు సం బంధించి డీకే మహిళా కళాశాలలో వే ర్వేరుగా ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో డీకే కళాశాలను పూర్తిస్థాయిలో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని భద్రతా ఏర్పాట్లు చూసే అధికారులు, సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు.
పుర ఓట్ల లెక్కింపు నెల్లూరులోనే
Published Wed, Apr 9 2014 3:38 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement