
ఇబ్రహీంపట్నం రూరల్: టీఆర్‌ఎస్ పార్టీకి ఏ ఇతర రాజకీయ పార్టీ లతో పొత్తులుండవని, నేరుగా ప్రజలతోనే పొత్తని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం కొంగరకలాన్‌లో జరిగే ప్రగతి నివేదన సభ పనులను మంత్రి కేటీఆర్ గురువారం పరిశీలించారు. వేదికకు సంబంధించిన వివరాలు మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ప్రతిపక్షాలను పట్టించు కోవడం మరిచిపోయారని, టీడీపీ, బీజేపీలకు ఇక్కడ ఉనికే లేదని విమర్శించారు. రాష్ట్రంలో యాభై ఏళ్లలో జరగని పనుల్ని కేవలం నాలుగేళ్లలో చేసి చూపించామన్నారు. రైతుబంధు, రైతుబీమా, కంటి వెలుగు లాంటి పథకాలు తీసుకొచ్చింది దేశ చరిత్రలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. విప్లవాత్మక, గుణాత్మక మార్పునకు కారణం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుదేనన్నారు. రూ.17వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రతిపక్షాలు అధికార దాహంతో బాధపడుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి సొంత వెన్నెముక లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment