
సాక్షి, ఏలూరు: పొత్తుల విషయంలో తాము క్లారిటీగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. బీజేపీకి జనంతోనే పొత్తు.. అవసరమైతే జనసేనతో పొత్తు అని వ్యాఖ్యానించారు. ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే టీడీపీ, జనసేన కలుస్తాయా లేదా అనేది పవన్ కల్యాణ్‌ను అడగాలని అన్నారు.
దేశంలో బీజేపీ ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేస్తుందని, దానితో ప్రజలను ఓట్లు అడుగుతామని సోము వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే తమకు ముఖ్యమని, 2024లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment