
తిరుపతి అర్బన్: తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలనే తాను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.
తిరుపతి నగరంలోని ఓ హోటల్‌లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలను కూడా కాపాడుకోలేని అసమర్థుడంటూ దుయ్యబట్టారు. రజకులను ఎస్సీల్లో చేర్చాలని, కాపులను బీసీల్లో చేర్చేందుకు తాము మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ థియోధర్, నేతలు విష్ణుకుమార్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్, పార్థసారథి ఉన్నారు.