తిరుపతి, గాంధీరోడ్డు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా కన్నా ప్యాకేజీయే ముద్దు అన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో బుధవారం సోమవీర్రాజు, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబే దగ్గరుండి ప్యాకేజీ తీసుకున్నారని తెలిపారు. ఈరోజు అధికారం పోయాక వారి ఎంపీలు హోదా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అధికార పార్టీ ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిందన్నారు.
తిరుపతి ఎన్నికల్లో ఇప్పటికే రెండు లక్షల దొంగ ఓట్లను వేసేందుకు ఆధార్ కార్డులు తయారు చేసినట్టు సమాచారం వచ్చిందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ చాలా దొంగ ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు గుర్తించారని వాటిని మీడియా సమక్షంలో చూపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఏపీలో ప్రజలు బీజేపీని గెలిపించకపోయినా బీజేపీ మాత్రం రాష్ట్రంపై ఎప్పుడూ చిన్నచూపు చూడలేదన్నారు. ఇప్పటికే 503 ప్రాజెక్టులను ఎంపిక చేశారని,రూ.8 లక్షల కోట్లు త్వరలోనే ఇవ్వబోతున్నారన్నారు. వలంటీర్ల వ్యవస్థను అడ్డంపెట్టుకుని ప్రజాధనాన్ని దురి్వనియోగం చేయడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. రైల్వే ప్రాజెక్టులు, సాగరమాల, కోవిడ్ సమయంలో రాష్ట్రానికి ఎంతో నిధులు ఇచ్చినట్టు చెప్పారు.
హోదా వద్దు అన్నది చంద్రబాబే
Published Thu, Mar 25 2021 5:06 AM | Last Updated on Thu, Mar 25 2021 5:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment