
విజయవాడ: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా వద్దన్నాడనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని, ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారని సోము వీర్రాజు స్పష్టం చేశారు. చంద్రబాబు వద్దన్నాడనే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు.
బహిరంగ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘అమరావతిని సింగపూర్, జపాన్ చేస్తా అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. ప్రజల డబ్బుతో చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారు. ప్రత్యేక హోదా అంటున్నారు...ఎందుకు వద్దన్నాడో చంద్రబాబుని అడగండి. చంద్రబాబు ప్రత్యేకహోదా వద్దు... ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు. చంద్రబాబు వద్దన్నాడని ప్రత్యేక హోదా ఇవ్వలేదు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment