
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రూ.6,500 కోట్లు కేంద్రం చంద్రబాబుకు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఆ నిధులతో రాజధానిని ఎందుకు కట్టలేదని చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని కోసం రైతులు నేడు రోడ్డుపై పాదయాత్రలు చేస్తున్నారని రైతులను రోడ్డుపై ఎవరు నడిపిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.
మంగళవారం గుంటూరులో లాడ్జిసెంటర్‌లో ప్రజా పోరు వీధి సమావేశానికి సోము వీర్రాజు హాజరయ్యారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్, మలేసియా, జపాన్ అంటూ అన్ని దేశాలు తిరిగి ఏ దేశం వెళితే ఆ దేశ రాజధాని తరహాలో ఏపీకి రాజధాని నిర్మాణం చేస్తానని పలు మార్లు చెప్పారన్నారు. దేశాలు తిరిగి వేల కోట్లు ఖర్చు చేశారే తప్ప, రాజధాని కట్టలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment