
మాట్లాడుతున్న సోము వీర్రాజు
అమలాపురం రూరల్: ఏపీ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ కాకినాడ జిల్లాకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడటం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు కోరినా కూడా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అడ్డుపడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా 5వేల స్ట్రీట్ కార్నర్ సభలు నిర్వహించబోతున్నట్లు వీర్రాజు చెప్పారు. మోదీ రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని వివరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment