
సాక్షి, అమరావతి: బీసీ సామాజిక వర్గానికి చెందిన మోదీ రెండోసారి ప్రధాని కాకూడదని కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి బీసీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. మోదీ ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
విజయవాడలో సోము పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఊళ్లో పెళ్లి అవుతుంటే ఎవరికో హడావుడి అన్నట్టు, ఇప్పుడు కేంద్రానికి మద్దతిస్తానని బాబు నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ రెండిటికీ తాము సమదూరంగా ఉంటామన్నారు.