
సాక్షి, విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. చంద్రబాబు ఒక అవకాశవాదని, అవసరమైనప్పుడు ఎవరినైనా లవ్ చేస్తాడంటూ సోము వీర్రాజు ధ్వజమెత్తారు.
‘చంద్రబాబు అవకాశవాది. ఎవరినైనా లవ్‌చేస్తాడు. తర్వాత వదిలేస్తాడు. అవసరమైనప్పుడు లవ్ చేయడంలో చంద్రబాబు సమర్ధుడు.1996లో కాంగ్రెస్‌లో చంద్రబాబు చక్రం తిప్పాడు అప్పటి నుంచి అన్ని పార్టీలను లవ్ చేశాడు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు సోము వీర్రాజు.