
గుంటూరు మెడికల్ /నెల్లూరు (బారకాసు): తామర పురుగు వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బుధవారం గుంటూరులో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వంగల శశిభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై మహాధర్నా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్భాటం కోసం వినియోగిస్తుందని ఆరోపించారు. రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే రైతుయాత్ర చేస్తామని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు మాట్లాడుతూ.. రైతుల సమస్యలను సీఎం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాలు అమ్ముకున్న చంద్రబాబు..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాలను చేపడితే.. అందులో ఒక్కో ఉద్యోగాన్ని రూ.5 లక్షలకు అమ్ముకుని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సొమ్ము చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు నగరంలో జరిగిన శక్తి కేంద్రాల బలోపేత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొదుపు సంఘాలను దివంగత ప్రధాని పీవీ నరసింహరావు గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తే.. వాటిని దివంగత ప్రధాని వాజ్‌పేయి పట్టణాలకు విస్తరింపజేయడంతో పాటు బలోపేతం చేశారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తానే డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం హాస్యాçస్పదమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment