
మాట్లాడుతున్న సోమువీర్రాజు
మదనపల్లె/చిత్తూరు కార్పొరేషన్: చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేకహోదా ఖరీదు రూ.15,000 కోట్లుగా ప్యాకేజీని నిర్ణయించి వాటితో పాటుగా ఆరు ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఇస్తే సరిపోతుందన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు. పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు అన్నమయ్య జిల్లా మదనపల్లెకు ఆదివారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు పట్టాలు ఇవ్వకుండా, ఐదేళ్లు అధికారంలో ఉండి సింగపూర్, జపాన్ అంటూ మోసగించిన వారిని నిలదీయాలన్నారు.