
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాపై ఇప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు.. సీఎంగా ఉన్న సమయంలో కేంద్రం దగ్గర ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని నిధులు కూడా తెచ్చుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ కూడా ఇప్పుడు రాష్ట్రానికి అదే విధంగా నిధులు రాబట్టుకోవాలన్నారు.
విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు సీఎంగా ఉండి కూడా రాజధానిని కట్టకుండా చంద్రబాబు విఫలమయ్యారన్నారు. ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.