
ఏపీ బీజేపీ చీఫ్ పదవి నుంచి తనని తప్పించడంపై..
సాక్షి, హైదరాబాద్: ఏపీ బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరి నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. మార్పులు చేర్పులపై తనకు బాధ లేదని.. ఒక కార్యకర్తగా కూడా పార్టీ కోసం పని చేస్తానని అన్నారాయన. అలాగే.. పురంధేశ్వరి నాయకత్వంలో అందరం కలిసి పని చేస్తాం అని ఆయన ప్రకటించారు.
ఏపీ బీజేపీ చీఫ్‌గా పదవీ కాలం ముగియడంతో ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వకుండా బాధ్యతల నుంచి తప్పించి.. దగ్గుబాటి పురంధేశ్వరిని నూతన అధ్యక్షురాలిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం.
ఇదీ చదవండి: సారీ.. మరో ఛాన్స్ ఇవ్వలేం!