
సాక్షి, రాజమండ్రి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు రావుపాలెం జొన్నాడ వద్ద వీరంగం సృష్టించారు. నా కారును ఎందుకు ఆపారంటూ పోలీసులపై దౌర్జన్యం చేశారు. కోనసీమ జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని సోమువీర్రాజును పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన సోమువీర్రాజు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఎస్సైని తోసేసి బెదిరింపులకు దిగారు. నా కారు ఎవరు ఆపమన్నారు ?. నేను మీతో మాట్లడను ఎస్పీతోనే మాట్లడతా అంటూ రచ్చ చేశారు. తన కారు ఎదుట ఉన్న మరొక వాహనదారుడిపైనా బండి తీయాలంటూ సోమువీర్రాజు రుబాబు చేశారు.
చదవండి: (గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్‌షాప్ ప్రారంభం)