
( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో భేటీ కానున్నారు. అనంతరం పలువురు బీజేపీ అధిష్టాన పెద్దలను కూడా కలవనున్నారు. కాగా, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదంటు సోము వీర్రాజు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.