
సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాటు సీఎంగా ఉండి చంద్రబాబు రాజధానిని కూడా కట్టలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మీడియా ప్యానలిస్టులు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులతో పాటు ఇతర ఆర్థిక నిపుణులు, న్యాయవాద– వివిధ రకాల వృత్తి విభాగాల ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఆ పార్టీ నేత ఐవైఆర్ కృష్ణారావు పాల్గొన్నారు.