సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్ జగన్‌కు అభినందనలు. మీ పాలనలో రాష్ట్రం అత్యున్నత శిఖరాలు అందుకోవాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనసార ఆకాంక్షిస్తున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. కేంద్రంలో ఘనవిజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీకి కూడా మహేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక గురువారం వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.
Congratulations @ysjagan on your landslide victory in Andhra Pradesh. May the state achieve great heights of success and prosperity in your tenure as the CM. 👍👍
— Mahesh Babu (@urstrulyMahesh) 24 May 2019
Honorable Prime Minister @narendramodi ji, many congratulations on your glorious win. May the nation continue to prosper and grow under your leadership 🙏🏻🙏🏻
— Mahesh Babu (@urstrulyMahesh) 24 May 2019
Comments
Please login to add a commentAdd a comment