
సాక్షి, అమరావతి: ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఐఏఎస్ అధికారులు భేటీ అయ్యారు. 23 మంత్రిత్వ శాఖలకు చెందిన 57మంది అధికారులు శుక్రవారం ఉదయం ఆయనను తాడేపల్లి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వివరాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అధికారులు వివరించారు. మరోవైపు ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఎమ్మెల్యేలు, నేతలుతో పాటు అభినందనలు తెలిపేందుకు వస్తున్న వారితో అక్కడ కోలాహలం నెలకొంది.