సాక్షి, అమరావతి : ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 15 మందికి, టీడీపీ 19 మంది మహిళలకు టికెట్లు కేటాయించాయి. వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసిన 15 మందిలో 13 మంది విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీ చేసిన 19 మందిలో రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని ఒక్కరే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పక్షాల తరఫున, స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం 187 మంది పోటీ చేయగా 14 మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
15 మంది పోటీ చేయగా 13 మంది విజయం
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున మొత్తం 15 మంది పోటీ చేయగా 13 మంది విజయం సాధించారు. పాతపట్నం నుంచి రెడ్డిశాంతి, పాలకొండ (ఎస్టీ) నుంచి విశ్వసరాయ కళావతి, కురుపాం(ఎస్టీ) నుంచి పాముల పుష్పా శ్రీవాణి, పాడేరు (ఎస్టీ) నుంచి కె. భాగ్యలక్ష్మి, రంపచోడవరం (ఎస్టీ)నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, కొవ్వూరు (ఎస్సీ) నుంచి తానేటి వనిత, ప్రత్తిపాడు (ఎస్సీ) నుంచి మేకతోటి సుచరిత, చిలకలూరిపేట నుంచి విడదల రజిని, పత్తికొండ నుంచి కె. శ్రీదేవి, సింగనమల (ఎస్సీ) నుంచి జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం నుంచి కేవీ ఉషా శ్రీచరణ, నగరి నుంచి ఆర్.కె. రోజా, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. విశాఖపట్నం తూర్పు నుంచి ఎ.విజయనిర్మల, పెద్దాపురం నుంచి తోట వాణి ఓడిపోయారు. అలాగే అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి సత్యవతి, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వంగా గీత, అరకు లోక్‌సభ స్థానం నుంచి గొడ్డేటి మాధవి విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment