సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఏడు గిరిజన నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన మోసపూరిత హామీలను గిరిజనులు నమ్మలేదు. ఈ ఐదు సంవత్సరాలుగా వారు పడుతున్న భాదలకు ఓటు రూపంలో బాబుకు గట్టి సమాధానం చెప్పారు. వైఎస్సార్‌సీపీ గెలిచిన ఈ స్థానాల్లో పార్టీ ఫిరాయించిన మూడు నియోజకవర్గాలు ఉండడం విశేషం. ప్రలోభాలకు లొంగి ఎమ్మెల్యేలు పార్టీ మారినా గిరిపుత్రులు మాత్రం వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారు. వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ తమ ఓటును ప్యాన్ గుర్తుకు వేసి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచారు. ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో గిరిజనులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించే వేదికగా ఉండాల్సిన గిరిజన సలహా మండలిని సైతం ఏర్పాటు చేయకపోవడం టీడీపీ ఓటమికి ప్రధాన కారణమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల లాగానే ఈ సారి కూడా గిరిజనులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే నమ్మారు.
Comments
Please login to add a commentAdd a comment