సాక్షి, రాయలసీమ/అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో ప్రభంజనం సృష్టించింది. వైఎస్సార్ సీపీ సునామికి అధికార పార్టీకి చెందిన పలువురు సిట్టింగులు సైతం తుడిచిపెట్టుకుపోయారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధికార టీడీపీ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా కుప్పంనుంచి గెలవగా ఆయన బావమరిది, సినీనటుడు బాలక్రిష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి గెలుపొందారు. ఈ రెండు సీట్లు గెలవటం మినహా రాయలసీమలో ఏ స్థానంలోనూ టీడీపీ ముందజలో లేకపోవటం గమనార్హం. రాయలసీమలో మెత్తం 52 నియోజకవర్గాల్లో 49 చోట్ల వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో 30 చోట్ల విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ ఈ సారి 19 స్థానాలు అత్యధికంగా గెలిచింది. గత ఎన్నికల్లో 22 చోట్ల గెలిచిన తెలుగుదేశం ఈ సారి రెండు స్ధానాలకు మాత్రమే పరిమితమయ్యింది. గత ఎన్నికల్లో కడపలో 9స్థానాల్లో గెలిచిన వైఎస్సార్ సీపీ ఈ సారి క్లీన్ స్వీప్‌చేసింది. మంత్రులుగా ఉన్న వారు సైతం ఈ ఎన్నికల్లో ఓటమిపాలవ్వటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment