సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన నారా చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో టీడీపీ ఘోరపరాజాయన్ని మూటగట్టుకుంది. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో ఈ ఎన్నికల్లో కనీస పోటీ లేకుండా వార్ వన్‌సైడ్ అయింది. దీంతో చంద్రబాబుపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేస్తున్నారు. తాను ప్రజల కోసం అహర్నిషులు కష్టపడుతున్నానని, కనీసం తన మనవడు దేవాన్ష్‌తో ఆడుకోవటానికి కూడా సమయంలేదని గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘ఇక టైమ్ వచ్చింది నీ మనవడితో ఆడుకోపో’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల తన మనవడితో ఆడుకున్న ఫొటోను చంద్రబాబు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఫొటోకే ఫన్నీ క్యాప్షన్ ఇస్తూ నెటిజన్లు వాట్సాప్ స్టేటస్‌లు, ట్వీట్లు చేస్తున్నారు. ‘అయ్యో చంద్రబాబు.. మన కోసం అహర్నిషులు కష్టపడుతూ.. మనవడితో ఆడుకోవడం లేదంటా.. ఈసారి ఆడుకునే సమయమిద్దాం.. బాబుగారు మీరు మీ మనవడితో ఆడుకోండి ఇక’ అంటూ ఫన్నీ క్యాప్షన్స్ ఇస్తున్నారు.
‘నేను ఓడిపోతే నాకు కుటుంబం ఉంది. భార్య, కుమారుడు, మనవడు ఉన్నారు.’ మరి మోదీకి ఎవరున్నారు? అంటూ చేసిన కామెంట్స్‌పై కూడా జోకులు పేల్చుతున్నారు. ‘మోదీ గెలిచారు.. దేశ ప్రధానిగా ఫుల్ బిజీగా ఉంటారు.. మీరు ఓడారు మీ కుటుంబంతో గడపండి’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment