
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు... ‘గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజాపక్షమే. ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ నరేంద్ర మోదీ, వైఎస్ జగన్‌లకు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
కాగా ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం పట్టారు. ఇటు శ్రీకాకుళం మొదలు అనంతపురం వరకూ అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఫ్యాన్‌గాలికి సైకిల్ కకావికలమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ ఘోర పరాజయం బాటలో పయనిస్తోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ హవా జోరుగా వీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment