
అందుకే చంద్రబాబు ఓడారు..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అఖండ విజయం సొంతం చేసుకున్న తెలిసిందే. ఆయన చారిత్రాత్మక విక్టరిపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఓ పాటను విడుదల చేశారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ‘విజయం విజయం.. ఘన విజయం’ పాటకు వైఎస్సార్‌సీపీ సంబరాలు, జగన్ పాదయాత్ర విజువల్స్‌ను జోడించి పాటను రూపొందించారు. ఈ పాటకు ‘ చంద్రబాబుపై జగన్ గ్రాండ్ విక్టరి. ఇది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రివేంజ్’ అంటూ క్యాఫ్షన్‌గా పేర్కొన్నాడు.
గురువారం ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ, చంద్రబాబుపై వరుస ట్వీట్లతో వ్యంగ్యాస్త్రాలు సంధించిన వర్మ.. మరుసటి రోజు(శుక్రవారం) కూడా విడిచిపెట్టలేదు. ‘నిన్న రాత్రి స్వర్గీయ ఎన్టీఆర్ నా కలలోకి వచ్చి లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఆపినందుకే చంద్రబాబును దారుణంగా ఒడిపోయేలా చేశానని చెప్పారు.’ అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఈ వేసివకాలంలో ఏపీలో చాలా స్టోక్స్ వచ్చాయని, కానీ ఒకే ఒక స్టోక్‌కు టీడీపీ విలవిలలాడిందని పేర్కొన్నారు. ఇలా వైఎస్ జగన్ విజయం.. చంద్రబాబు ఓటమిని వర్మ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
“Vijayam” victory song of @ysjagan over @ncbn The revenge of NTR #LakshmisNTR https://t.co/gZh8yLtLmq
— Ram Gopal Varma (@RGVzoomin) 24 May 2019
నిన్న రాత్రి స్వర్గీయ ఎన్.టీ.ఆర్ గారు నా కలలోకి వచ్చి లక్ష్మీస్ ఎన్.టీ.ఆర్ విడుదల ఆపినందుకే CBN ని దారుణంగా ఒడిపోయేలా చేశానని చెప్పారు. pic.twitter.com/5oOZfpUjm5
— Ram Gopal Varma (@RGVzoomin) 24 May 2019