సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి బరిలో దిగిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 8 మంది వైఎస్సార్‌సీపీ నుంచే విజయం సాధించడం విశేషం. నంద్యాల, కర్నూలు పార్లమెంట్ స్థానాల నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులుగా పోచా బ్రహ్మానందారెడ్డి, డాక్టర్ సంజీవ్‌కుమార్ పోటీ చేశారు. అలాగే నంద్యాల, ఆళ్లగడ్డ, పత్తికొండ, కోడుమూరు, నందికొట్కూరు, కర్నూలు అసెంబ్లీ స్థానాల నుంచి వరుసగా శిల్పా చక్రపాణిరెడ్డి, గంగుల నాని, కంగాటి శ్రీదేవి, జె.సుధాకర్, తొగురు ఆర్థర్, హఫీజ్‌ఖాన్ బరిలో ఉన్నారు.
వీరంతా తమతమ ప్రత్యర్థులు వరుసగా భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియా, కేఈ శ్యామ్‌బాబు, రామాంజనేయులు, బండి జయరాజు, టీజీ భరత్‌లను మట్టి కరిపించారు. అలాగే పోచా బ్రహ్మానందరెడ్డి మాండ్రశివానందరెడ్డిని, డాక్టర్ సంజీవ్‌కుమార్ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిని ఓడించారు. వీరంతా మొదటి సారి పోటీ చేసినా విజయబావుటా ఎగురవేశారు.
ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులు...
ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి మొదటి సారి కొందరు పోటీ చేసి ఓటమిని మూట గట్టుకున్నారు. అందులో కర్నూలు నుంచి టీజీ భరత్, కోడుమూరు నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు, పత్తికొండ నుంచి పోటీ చేసిన కేఈ శ్యామ్‌బాబు, నందికొట్కూరు నుంచి పోటీ చేసిన బండి జయరాజు, నంద్యాల ఎంపీగా పోటీ చేసిన మాండ్ర శివానందరెడ్డి ఓడిపోయి ఇంటి బాట పట్టారు.
8 మంది వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు గెలుపు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి బరిలో దిగిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 8 మంది వైఎస్సార్‌సీపీ నుంచే విజయం సాధించడం విశేషం. నంద్యాల, కర్నూలు పార్లమెంట్ స్థానాల నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులుగా పోచా బ్రహ్మానందారెడ్డి, డాక్టర్ సంజీవ్‌కుమార్ పోటీ చేశారు. అలాగే నంద్యాల, ఆళ్లగడ్డ, పత్తికొండ, కోడుమూరు, నందికొట్కూరు, కర్నూలు అసెంబ్లీ స్థానాల నుంచి వరుసగా శిల్పా చక్రపాణిరెడ్డి, గంగుల నాని, కంగాటి శ్రీదేవి, జె.సుధాకర్, తొగురు ఆర్థర్, హఫీజ్‌ఖాన్ బరిలో ఉన్నారు. వీరంతా తమతమ ప్రత్యర్థులు వరుసగా భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియా, కేఈ శ్యామ్‌బాబు, రామాంజనేయులు, బండి జయరాజు, టీజీ భరత్‌లను మట్టి కరిపించారు. అలాగే పోచా బ్రహ్మానందరెడ్డి మాండ్రశివానందరెడ్డిని, డాక్టర్ సంజీవ్‌కుమార్ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిని ఓడించారు. వీరంతా మొదటి సారి పోటీ చేసినా విజయబావుటా ఎగురవేశారు.
ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులు...
ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి మొదటి సారి కొందరు పోటీ చేసి ఓటమిని మూట గట్టుకున్నారు. అందులో కర్నూలు నుంచి టీజీ భరత్, కోడుమూరు నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు, పత్తికొండ నుంచి పోటీ చేసిన కేఈ శ్యామ్‌బాబు, నందికొట్కూరు నుంచి పోటీ చేసిన బండి జయరాజు, నంద్యాల ఎంపీగా పోటీ చేసిన మాండ్ర శివానందరెడ్డి ఓడిపోయి ఇంటి బాట పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment