
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘ కాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయం కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆయన వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పాదయాత్రే వైఎస్ జగన్‌ను గెలిపించిందని వ్యాఖ్యానించారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియా మాట్లాడుతూ.. ‘పట్టాభిషేకానికి ముందు శ్రీరాముడు పడ్డ కష్టాలే వైఎస్ జగన్ పడ్డారు. వైఎస్ జగన్ రాష్ట్రానికి మంచి పాలన అందిస్తారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు తరహాలో 30 ఏళ్లకు పైబడి వైఎస్ జగన్ పాలన అందిస్తారు. వైఎస్ జగన్ తను అనుకున్నది సాధిస్తారు. ప్రజల ఆశీస్సులు వైఎస్ జగన్‌కు ఉండటం వల్లే.. ఆయనకు బ్రహ్మారథం పట్టార’ని తెలిపారు.
అలాగూ కేంద్రంలో విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కర్ణాటకలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన సినీనటి సుమలతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.